IMAX: అమ్మబాబోయ్‌.. ఐమాక్స్‌ సినిమా అంటే ఇలా ఉంటుందా...

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:32 AM

మారుతున్న కాలం, పెరుగుతున్నటెక్నాలజీని బట్టి ప్రేక్షకులు కూడా అప్‌డేట్‌ అయ్యి కొత్తదనాన్ని, టెక్నాలజీకి అనుగుణంగా వచ్చిన మార్పులను కోరుకుంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఇది కాస్త ఎక్కువే.

మారుతున్న కాలం, పెరుగుతున్నటెక్నాలజీని బట్టి ప్రేక్షకులు కూడా అప్‌డేట్‌ అయ్యి కొత్తదనాన్ని, టెక్నాలజీకి అనుగుణంగా వచ్చిన మార్పులను కోరుకుంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఇది కాస్త ఎక్కువే. సినిమాల విషయానికొస్తే.. స్క్రీనింగ్, సౌండింగ్‌, విజువల్స్‌ ఇలా ప్రతి అంశంలోనూ కొత్తను కోరుకుంటున్నారు.. ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం కాలంలో భారీ చిత్రాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. దానికి తగ్గట్టే థియేటర్‌లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించాలనుకుంటున్నారు మేకర్స్‌. పెద్ద స్క్రీన్ అనగానే గుర్తొచ్చేది ఐమాక్స్‌. స్క్రీన్ సైజ్‌లో కానీ, విజువల్‌గా కానీ, సౌండింగ్‌లో కానీ దీని రూటే వేరు. ఐమాక్స్‌  స్క్రీన్స్ లో  సినిమా చూస్తే కలిగే అనుభూతి మరే  స్క్రీన్ లో చూసినా  రాదన్నది నిజం. (The odyssey Imax Screening)

Imax.JPG

ఐమాక్స్‌ ఫార్మెట్‌ (IMAX Formate) స్క్రీన్..  దాని ప్రొజెక్షన్‌ ఎలా ఉంటుందో చూద్దాం..

హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ఎప్పుడూ అద్భుతాలకు మారుపేరుగా నిలుస్తుంటాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey) మరోసారి ప్రపంచ సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా కథతోనే కాదు, దాని ప్రదర్శన కోసం ఉపయోగించిన భారీ 70ఎంఎం ఐమ్యాక్స్ ఫిల్మ్ ప్రింట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

  • నోలన్ ఈ చిత్రాన్ని పూర్తిగా IMAX ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించారు. దీంతో థియేటర్లలో ప్రదర్శించేందుకు ఉపయోగించే ఒక్క 70ఎంఎం ఫిల్మ్ ప్రింట్ బరువు ఏకంగా 384 కిలోలు. 

  • ఒక్క ప్రింట్‌లో ఉపయోగించిన ఫిల్మ్ పొడవు 6,40,000 మీటర్లు (640 కిలోమీటర్లు).

  • ఈ సినిమాను నిర్మించడానికి, ప్రచారం చేయడానికి కలిపి సుమారు 375 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,200 కోట్లకు పైగా) ఖర్చు చేసినట్లు సమాచారం. 

The od.jfif
ఈ భారీ ప్రింట్‌ను ప్రొజెక్టర్‌లో ఎలా
అమర్చాలో చూపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ థియేటర్ చైన్ సినీమార్క్ ప్రత్యేక వీడియోను విడుదల చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది.  ‘ది ఒడిస్సీ’ చిత్రాన్ని డిజిటర్‌ పార్మెట్‌లో కాకుండా ఒరిజినల్‌ 70 ఎంఎం ఐమ్యాక్స్‌ ఫార్మెట్‌ ఫిలిం ప్రొజెక్టర్‌తో ప్రదర్శిస్తున్న థియేటర్‌ ఇది. ఈ థియేటర్‌లోని ప్రొజెక్షన్‌ రూమ్‌కి వెళ్లి చూస్తే.. అదొక టైం మెషీన్‌లాగా ఉంది. అక్కడున్న స్క్రీనింగ్, సౌండింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను చూస్తే ప్రయోగశాలలోకి వచ్చామా అనిపించక మానదు.  'ది ఒడిస్సీ’ని ప్రదర్శించడానికి ఐమాక్స్‌ ఫిల్మ్‌ ఫార్మెట్‌ థియేటర్ల ప్రొజెక్టర్‌ గదిలో ఆపరేటర్‌ చేసే కసరత్తులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీని లోడింగ్‌ ప్రక్రియ ఎలా ఉంటుందో జనాలకు తెలియాలని ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది చూసిన వారంతా 70ఎంఎం ఐమ్యాక్స్‌ ఫిలిం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. 

నోలన్‌ ఏ విజన్‌తో అయితే తెరకెక్కించారో.. దాన్ని వంద శాతం ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేలా 1.43:1 యాస్పెక్ట్‌ రేషియో తెరతో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి థియేటర్లు 41 మాత్రమే ఉన్నాయి. వాటిలో 26 అమెరికాలో ఉండగా, యూకేలో 3, మెల్‌బోర్న్‌లో 1, మిగిలినవి కెనడా, చెక్‌ రిపబ్లిక్‌ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. డిజిటల్ యుగంలో చాలా సినిమాలు హార్డ్‌డిస్క్, సర్వర్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలో, నోలన్ మాత్రం 70ఎంఎం ఐమ్యాక్స్ ఫిల్మ్ ఫార్మాట్‌కే ప్రాధాన్యం ఇవ్వడం సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్న ఐమాక్స్ ప్రొజెక్షన్ రూమ్ చూసి 'ఇది సినిమా ఫైల్ కాదు... ఒక కార్గో!" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

IMAx-Od.jpg

ఒరిజినల్‌ ఐమ్యాక్స్‌ థియేటర్లో ‘ది ఒడిస్సీ’లాంటి సినిమా చూస్తే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేమని సినీ ప్రియులు చెబుతున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయి ఐమ్యాక్స్‌ కెమెరాలతో చిత్రీకరణ జరుపుకొని, అందుబాటులో ఉన్న ఐమాక్స్‌ ఫిలిం ఫార్మెట్‌లో విడుదలైన సినిమాగా ‘ది ఒడిస్సీ’ ప్రత్యేకత చాటుకుంది. ఇండియాలో ఇలాంటి థియేటర్‌ ఒక్కటి కూడా లేదు. త్వరలో వచ్చే అవకాశం ఉంది.  ప్రస్తుతం తెలుగులో అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రం ఐమాక్స్ ఫార్మాట్ లోనే తెరకెక్కుతుంది. 

Updated Date - Jul 22 , 2026 | 11:48 AM