OG: బుల్లితెరపైకి పవర్ స్టార్ 'ఓజీ'..
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:03 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ హిట్ చిత్రం 'ఓజీ' (They Call Him OG) ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ హిట్ చిత్రం 'ఓజీ' (They Call Him OG) ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, థియేటర్లలో అలరించిన దాదాపు పది నెలల తర్వాత టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సుజీత్ దర్శకత్వం వహించగా, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అనంతరం ఓటీటీలోను సత్తా చాటింది.
ఇప్పుడు ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. 'ఓజీ' శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది. ఇటీవలే ఛానల్ విడుదల చేసిన ప్రోమోలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ఆగస్టు 15 న 'ఓజీ' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న మరోసారి రీ-టెలికాస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాశ్ రాజ్, శ్రేయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ALSO READ:
GDN: ‘జీడీఎన్’ వచ్చేది ఎప్పుడంటే..
స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే