‘మొహబ్బత్’ నుంచి యూత్‌ఫుల్ లవ్ సాంగ్.. ‘వరమే’ విడుదల
ABN, Publish Date - Nov 27 , 2026 | 02:50 PM
సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా నటించిన ‘మొహబ్బత్’ సినిమా నుంచి ‘వరమే’ యూత్‌ఫుల్ లవ్ సాంగ్ విడుదలైంది. డిసెంబర్ రెండో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందిన చిత్రం 'మొహబ్బత్'. అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ మూవీకి మ్యాక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో భాగంగా ‘వరమే’ అంటూ సాగే యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ని డైరక్టర్ విఐ ఆనంద్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ప్రేమ గీతాన్ని కృష్ణ తేజస్వి ఆలపించగా.. భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు. సునీల్ కశ్యప్ బాణీ సమకూర్చారు. యూత్ ఆడియెన్స్‌కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంది. ఈ చిత్రంలో ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, సంతోష్ రాజా, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సలీమ్ షేక్, సినిమాటోగ్రఫర్‌గా వైఎస్ కృష్ణ, రచయితగా కలాం, ఎడిటర్‌గా శ్రీ వర ప్రసాద్ వర్క్ చేశారు.
ఇవి కూడా చదవండి:
విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్యలు!
దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి
ఒకరు శ్రీకాళహస్తిలో.. మరొకరు తిరుమలలో.. ఆలయాల బాట పట్టిన స్టార్స్!