Rapid Chitram: RC17, ప్రభాస్ కొత్త సినిమా.. మోర్ అప్డేట్స్
ABN, Publish Date - Oct 15 , 2026 | 01:02 PM
తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. మరెందుకు ఆలస్యం.. తాజా సినీ అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి.
రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న ‘ఆర్సీ 17’ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ ఆఫీస్‌ను ప్రారంభించారు. గ్రాండ్‌గా జరిగిన పూజా కార్యక్రమాల్లో సుకుమార్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ పాల్గొన్నారు. దసరా కానుకగా ఈ సినిమాను ప్రారంభించి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ‘ద రాజాసాబ్’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో మరో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘గరివిడి లక్ష్మి’ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2028లో పట్టాలెక్కనుందన్నారు.
‘వారణాసి’ సినిమా షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చి దర్శకుడు రాజమౌళి కుటుంబంతో కలసి అమెరికా వెళ్ళారు. అక్కడ వైభవంగా జరిగిన ఫ్యామిలీ మ్యారేజ్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను ఎం.ఎం. శ్రీలేఖ షేర్ చేయగా వైరల్‌గా మారాయి. హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో రూపుదిద్దుకుంటున్న సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘హతః’ నైజాం, వైజాగ్ థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు తీసుకున్నారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
విశాఖలో మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్.. లీక్ చేసిన ఎమ్మెల్యే
బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..
Updated at - Oct 15 , 2026 | 01:02 PM