ప్రపంచ సినిమా సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’
ABN, Publish Date - Jul 24 , 2026 | 04:24 PM
ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి.
దర్శకుడు సుబ్బారెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్న ‘వారణాసి’ టైటిల్‌ను రాజమౌళికి ఇచ్చేశారు. తెలుగు సినిమా గౌరవం, ఇండస్ట్రీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. చిత్ర బృందానికి ఆశీస్సులు అందించిన చిరు.. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సంక్రాంతి 2027 బరిలో సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా రెడీ అవుతోంది. రీసెంట్‌గా కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని పొంగల్ రేసులో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ నటించిన ‘రోమాంచకం’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘రాధా రమణ’ అంటూ సాగే పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. వాసుకి వైభవ్ పాడి స్వరపరిచారు. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన బుక్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కొరకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
త్రిషకి ‘జననాయగన్’ నచ్చలేదా? అందుకే సైలెంట్‌గా...
‘జన నాయగన్’.. బాలయ్యని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడా?
రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?