‘జ‌న‌ నాయ‌గ‌న్’.. బాలయ్యని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడా?

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:48 PM

కొన్ని రీమేక్ సినిమాలు ఒరిజినల్ కథలను మించి విజయాలు సాధిస్తే, మరికొన్ని మాత్రం మూల కథలోని ఆత్మను మ్యాచ్ చేయలేక నిరాశపరుస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహా పోలిక ఇప్పుడు దళపతి విజయ్ చివరి చిత్రం ‘జ‌న‌ నాయ‌గ‌న్’ విషయంలో తెగ చర్చనీయాంశమవుతోంది.

Vijay and Balakrishna

సినిమా పరిశ్రమలో ఒక భాషలోని సూపర్ హిట్ చిత్రాలను మరో భాషలోకి రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ పరిపాటిలో కొన్ని రీమేక్ సినిమాలు ఒరిజినల్ కథలను మించి విజయాలు సాధిస్తే, మరికొన్ని మాత్రం మూల కథలోని ఆత్మను మ్యాచ్ చేయలేక నిరాశపరుస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహా పోలిక ఇప్పుడు దళపతి విజయ్ (Vijay) చివరి చిత్రం ‘జ‌న‌ నాయ‌గ‌న్’ (Jana Nayagan) విషయంలో తెగ చర్చనీయాంశమవుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా మూడేళ్ల క్రితం వచ్చి ఘనవిజయం సాధించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి ఇది తమిళ రీమేక్. ఒరిజినల్ కథలోని సందేశం నచ్చడంతో విజయ్ ఈ సినిమాను తన చివరి ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నారనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి.


విజయ్ ఇమేజ్‌ను, తమిళనాడు రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు హెచ్. వినోద్‌ ఈ సినిమాను రూపుదిద్దారు. అయితే కథనంపరంగా, ముఖ్యంగా ద్వితీయార్థంలో చేసిన విపరీతమైన మార్పులు సినిమా గ్రాఫ్‌ను దెబ్బతీశాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ తనదైన మాస్ స్వాగ్, డైలాగ్ డెలివరీతో సీన్లను వేరే లెవల్‌కు తీసుకెళ్లగా, ఆ మ్యాజిక్‌ను తమిళంలో రీ-క్రియేట్ చేయడంలో దర్శకుడు వినోద్ కొంత తడబడ్డారనే టాక్ వస్తోంది. మూల కథను యథాతథంగా తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, విపరీతమైన మార్పులే డ్యామేజ్ చేశాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికితోడు ‘‘నటసింహం చూపించిన మాస్ అండ్ ఎమోషనల్ మేనరిజాన్ని మ్యాచ్ చేయడం ఎవరికీ అంత ఈజీ కాదు బ్రో’’ అని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వాస్తవానికి విజయ్‌కు తెలుగు సినిమాలను తమిళంలోకి రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. తన కెరీర్‌లో ‘పెళ్లి సందడి, పవిత్ర బంధం, బద్రి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, ఒక్కడు, అతనొక్కడే, పోకిరి’ వంటి అనేక టాలీవుడ్ హిట్లను తమిళంలో రీమేక్ చేసి, వాటిలో మెజారిటీ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే ‘భగవంత్ కేసరి’లో అమ్మాయిల రక్షణ, ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించిన మంచి సందేశం ఉండటంతో విజయ్ దీనిని తన చివరి సినిమాగా రీమేక్ చేయడానికి మొగ్గు చూపి ఉంటారని భావిస్తున్నారు. కాకపోతే, కొన్ని రకాల పవర్‌ఫుల్ పాత్రలు, యాటిట్యూడ్ కేవలం బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కే సరిగ్గా సరిపోతాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.


దర్శకుడు అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలయ్య ఇమేజ్‌కు తగినట్లుగా రెగ్యులర్ డ్యూయెట్లు, హీరోయిన్ ట్రాక్‌లను పక్కనపెట్టి పెప్పర్ అండ్ సాల్ట్ లుక్‌లో సరికొత్తగా చూపించారు. శ్రీలీల పాత్ర చుట్టూ కథను తిప్పుతూ బలమైన ఎమోషన్‌ను పండించడంతో ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. విజయ్ కూడా అటువంటి ప్రాధాన్యత ఉన్న మంచి మెసేజ్ ఉన్న కథను ఎంచుకోవడం సరైన నిర్ణయమే అయినప్పటికీ, ఒరిజినల్‌లో బాలయ్య చూపించిన ఇంపాక్ట్‌ను స్క్రీన్ మీద రీ-క్రియేట్ చేయలేకపోవడం గురించే ప్రస్తుతం తమిళ, తెలుగు ఫ్యాన్స్ విశేషంగా చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?

‘రా ఎన్టీఆర్’ క్లోజ్ చేస్తున్నాం.. అందరి అనుమానాలివే

Jana Nayakudu: విజయ్‌ జన నాయకుడు రివ్యూ

Updated Date - Jul 24 , 2026 | 02:48 PM