త్రిషకి ‘జననాయగన్’ నచ్చలేదా? అందుకే సైలెంట్‌గా...

ABN , Publish Date - Jul 24 , 2026 | 03:58 PM

ప్రస్తుతం తమిళనాట విజయ్ నటించిన ‘జననాయగన్’ ఫీవర్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి.

Trisha Jana Nayagan

ప్రస్తుతం తమిళనాట విజయ్ నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) ఫీవర్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. సీఎం విజయ్ (CM Vijay) ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ ఈ సినిమా కోసం థియేటర్ల దగ్గర డ్యూటీ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్‌కి ఎంతో ప్రతిష్టాత్మక మైన ఈ చిత్రాన్ని కథానాయిక త్రిష (Heroine Trisha) మొదటి రోజే వీక్షించారు. అది కూడా సాధారణ ప్రేక్షకుడిలా థియేటర్లో అభిమానుల మధ్య కూర్చొని ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడటం విశేషం. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోన్న విషయం తెలియంది కాదు.


అయితే, సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ వెలుపల ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాను చూశాక, అందులోనూ విజయ్ నటించిన సినిమాను చూశాక.. అందాల భామ త్రిష సినిమా గురించి ఏమైనా మాట్లాడుతుందేమో అని అంతా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుందని మీడియా కూడా ఆమె వచ్చే వరకు వేయి కళ్లతో.. కాదు కాదు.. కెమెరాలతో ఎదురుచూసింది. కానీ, ‘జననాయగన్’ చూసి బయటకు వచ్చిన త్రిష, అక్కడ వేచి ఉన్న మీడియాతో అసలు మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్లిపోయారు.


మీడియా ప్రతినిధులు ‘సినిమా ఎలా ఉంది?’ అని పదే పదే ప్రశ్నించినప్పటికీ, త్రిష కనీసం నోరు మెదపకపోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమెకు ‘జననాయగన్’ సినిమా నచ్చలేదా? అందుకే అలా రియాక్ట్ కాకుండా వెళ్లిపోయారా? అనేలా గుసగుసలు వినబడుతున్నాయి. త్రిష ఏ చిన్న మాట మాట్లాడినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యేది, కానీ ఇప్పుడు ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళడం కూడా పెద్ద వైరల్ వార్తగా మారడం విశేషం! ఏదిఏమైనా, త్రిష పేరు ప్రస్తుతం తమిళనాట మాత్రం ఓ సంచలనంగా మారిందన్నది మాత్రం కాదనలేని వాస్తవం.

ఇవి కూడా చదవండి:

‘జ‌న‌ నాయ‌గ‌న్’.. బాలయ్యని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడా?

రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?

‘రా ఎన్టీఆర్’ క్లోజ్ చేస్తున్నాం.. అందరి అనుమానాలివే

Updated Date - Jul 24 , 2026 | 03:58 PM