Rapid Chitram: ‘కరికాల’ ప్రారంభం, రశ్మిక ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’.. ఇంకా కొత్త సినిమాల అప్‌డేట్స్

ABN, Publish Date - Oct 16 , 2026 | 02:49 PM

తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. మరెందుకు ఆలస్యం.. తాజా సినీ అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి.

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ‘శంభాల’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో ‘కరికాల’ చిత్రం గురువారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ, రశ్మిక దంపతుల ‘రణబాలి’ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే రశ్మిక దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 400 కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం విశేషంగా మారింది. ఇలా ఏడాదిపాటు రశ్మిక సాయం కొనసాగిస్తారని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో రశ్మిక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

‘మా రాముడు అందరివాడు’ హీరో శ్రీరామ్ కథానాయకునిగా ‘రామభద్రుడు’ చిత్రం ప్రారంభమయింది. ఇది హీరో శ్రీరామ్‌కు 13వ చిత్రం. ఈ సినిమాకు మహేశ్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గా వరప్రసాద్, సుందరరాజ్ నిర్మాతలు. మళయాళ కెమెరామ్యాన్ సామ్ దత్ తొలిసారి తెలుగులో ‘డోంట్ స్లీప్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంద్రారామ్, జోయితా బెనర్జీ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. వి డ్రీమ్ ఫిలిమ్స్ పతాకంపై చూడామణి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇంకా ఇలాంటి మరెన్నో సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

విశాఖలో మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్.. లీక్ చేసిన ఎమ్మెల్యే

బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం

MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..

Updated at - Oct 16 , 2026 | 03:14 PM