పుట్టపర్తిలో.. విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:14 PM
ప్రముఖ సినీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు గురువారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం (Prasanthi Nilayam) దసరా శరన్నవరాత్రి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) దంపతులు ప్రత్యేక కాన్వాయ్లో ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సాయి కుల్వంత్ సభామందిరంలో సత్యసాయి బాబా మహాసమాధిని దంపతులు ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. తమ నూతన చిత్రం ‘రణబాలి’ ప్రారంభోత్సవం సందర్భంగా సత్యసాయి బాబా (Puttaparthi Sathya Sai Baba) ఆశీస్సులు పొందేందుకు వారు వచ్చినట్లు తెలిసింది.
అనంతరం గణేష్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు మూడు ప్రదక్షిణలు చేశారు. ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపారు. అనంతరం సన్నిధిలో విశ్వశాంతిని కాంక్షిస్తూ చేపట్టిన యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను చదువుకున్న పాఠశాలను, తన బాల్యంతో అనుబంధం ఉన్న ప్రాంతాలను రష్మికతో కలిసి విజయ్ సందర్శించారు.
ప్రముఖ సినీ తారలు పుట్టపర్తికి వచ్చారన్న సమాచారం తెలియడంతో వారిని చూసేందుకు యువత, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రశాంతి నిలయం పరిసరాల్లో సందడి నెలకొరాకతో పుట్టపర్తిలో అభిమానుల ఉత్సాహం కనిపించింది.