సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: ‘జై హనుమాన్’లో మమిత బైజు?.. ‘రామాయణం’ హక్కులు ఆయనకే!

ABN, Publish Date - Oct 11 , 2026 | 06:06 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు జోరు మామూలుగా లేదు. స్టార్ హీరోస్‌తో పాటు బిగ్ బ్యానర్స్‌లో ఛాన్స్‌లు కొట్టేస్తోందీ భామ. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తోన్న ‘జై హనుమాన్’లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం’ తెలుగు రాష్ట్రాల హక్కులను నిర్మాత దిల్‌ రాజు దక్కించుకున్నారు. ‘టాక్సిక్‌’తో తీవ్ర నష్టాలు చవిచూసిన ఆయన ఈ మూవీతో మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్నారు. రణబీర్ కపూర్, సాయిపల్లవి నటించిన ఈ ఎపిక్ మూవీ నవంబర్ 5న విడుదల కానుంది.

‘సంబరాల ఏటి గట్టు’ తర్వాత సాయిదుర్గ తేజ్ దర్శకుడు తేజ కాకుమానుతో ఓ యాక్షన్ డ్రామా‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభమై.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. శ్రీవిష్ణు, జానకిరామ్ మారెళ్ళ కాంబోలో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో ఆనందం వ్యక్తం చేసిన మేకర్స్, ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఇంకా ఇలాంటి సినీ సమాచారం కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో పురోగతి.. ఏపీ అభివృద్ధిపై చిరు కీలక వ్యాఖ్యలు

ఏపీ ఫిలిం ఛాంబర్‌లో M4M హవా.. జో శర్మ, మోహన్ వడ్లపట్లకు అవార్డులు

ప్రసవం తర్వాత లుక్స్‌పై కామెంట్స్.. కత్రినా ఇచ్చిపడేసింది

Updated Date - Oct 11 , 2026 | 06:10 PM