Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Oct 02 , 2026 | 11:39 AM
సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!
‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై వస్తున్న పుకార్లకు నిర్మాత నాగవంశీ తెరదించారు. అక్టోబర్ 6న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. అక్టోబర్ 9న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. పైగా అక్టోబర్ 7 నుంచే బుకింగ్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’ రెండు భాగాలుగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. బడ్జెట్, ఓటీటీ డీల్స్ దృష్టిలో పెట్టుకుని 2027 డిసెంబర్‌లో పార్ట్-1ను, అలాగే పార్ట్-2ను 2028లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ‘ఇరుముడి’ హిట్‌తో జోరుమీదున్న రవితేజ, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చేయనున్నారు. ‘తులాభారం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా షూటింగ్ దసరాకు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారట.. ఇంకా ఇలాంటి సినీ సమాచారం కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
ఫేవరెట్ హీరోతోనే పోటీకి శ్రీవిష్ణు.. ఆ వేవ్‌ను తట్టుకోగలడా?
‘కుకూన్స్’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే
ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ వైఫ్.. ఈ వివాదానికి అంతమెప్పుడు?