‘కుకూన్స్’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే

ABN , Publish Date - Oct 01 , 2026 | 09:50 PM

జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘కుకూన్స్’కు దర్శకుడు అనిల్ రావిపూడి సపోర్ట్ అందించారు.

Cocoons Poster Launch

జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కుకూన్స్’ (Cocoons). న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ గౌరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేలా సరికొత్త ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అధికారికంగా విడుదల చేశారు.


పోస్టర్ లాంచ్ అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ చిత్ర బృందానికి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘కుకూన్స్’ సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ డిజైన్ చాలా కొత్తగా ఉండి వెంటనే ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు మహేశ్ గౌరి ఎంతటి సరికొత్త ఆలోచనలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారో ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. టైటిల్ కూడా ఎంతో క్యాచీగా, వైవిధ్యంగా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో ఒకరైన వికాస్ గతంలో ప్రముఖ రియాలిటీ షో ‘డ్రామా జూనియర్స్’కు మెంటార్‌గా పనిచేసి మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రంతో నటుడిగా వెండితెరపై అడుగుపెడుతున్నారు. జగన్, సాగర్, వికాస్ సహా చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అంటూ అనిల్ రావిపూడి చిత్ర బృందాన్ని ప్రశంసించారు.


కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘కుకూన్స్’ కూడా వినూత్న కాన్సెప్ట్‌‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల కావడం సినిమాపై బజ్‌ను పెంచింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ వైఫ్.. ఈ వివాదానికి అంతమెప్పుడు?

Jangaa: ‘జంగా’లో మధునందన్ క్యారెక్టర్ పోస్టర్ వైరల్

పవన్ ‘తీన్‌మార్’ హిట్ కాదని ముందే తెలుసు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Updated Date - Oct 01 , 2026 | 09:50 PM