దిల్ రాజు 'మార్కండేయ'లో విక్రాంత్
ABN, Publish Date - Jul 30 , 2026 | 04:17 PM
'సంతాన ప్రాప్తిరస్తు' ఫేమ్ విక్రాంత్ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దిల్ రాజు మూవీ కాగా మరొకటి మధుర శ్రీధర్ - సురేశ్ బాబు నిర్మిస్తున్న చిత్రం!
'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హీరో విక్రాంత్. ఈ సినిమాలో విక్రాంత్ నటనకు మంచి పేరొచ్చింది. 'సంతాన ప్రాప్తిరస్తు' డిస్నీ హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో 200 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుని కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో హీరో విక్రాంత్ ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
విక్రాంత్ ప్రస్తుతం ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో 'మార్కండేయ' అనే డివోషనల్ మిస్టికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు డ్రీమ్స్ సంస్థ తొలి సినిమా హీరో విక్రాంత్ కావడం విశేషం. ఈ సినిమా త్వరలో చిత్రీకరణ జరుపుకోనుంది. దీనితో పాటు మధుర శ్రీధర్ రెడ్డి - ప్రొడ్యూసర్ సురేశ్ బాబు కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రంలోనూ విక్రాంత్ నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు. విక్రాంత్ హీరోగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు 'మధుర' శ్రీధర్ రెడ్డి.
ఇవి కూడా చదవండి:
Spider-Man: Brand New Day Review: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ
రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే
సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!