రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే

ABN , Publish Date - Jul 29 , 2026 | 01:06 PM

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.

Gabbar Singh Villain Gang about Pawan Kalyan

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ (Gabbar Singh Ramesh) బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతనికి తక్షణ సాయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం అందించారు. అంతేకాదు, రమేష్ డిశ్చార్జ్ అయ్యే వరకు తనే చూసుకుంటానని పూర్తి భరోసా ఇచ్చినట్లుగా.. తాజాగా గబ్బర్ సింగ్ విలన్ గ్యాంగ్, రమేష్ స్నేహితులు మీడియాకు తెలిపారు.

గబ్బర్ సింగ్ విలన్ గ్యాంగ్‌లోని సాయి మాట్లాడుతూ.. ‘‘మా పవన్ కళ్యాణ్.. మా దేవుడు.. మాకు ఎప్పుడేం కావాలన్నా ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటారు. మా పవన్ కళ్యాణ్ సార్‌ని మేమెందుకు దేవుడు అంటామంటే.. ఇలాంటి సంఘటన అయినప్పుడు ముందు ఉంటారు. మాకే కాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే.. 140 కోట్ల మందికి ఆయన అండగా ఉంటారు. రైతుల కోసం ఆయన నిలబడిన తీరు కానీ, ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ సార్ కోసం మా గబ్బర్ సింగ్ టీమ్ చావడానికి కూడా రెడీగా అంటాం. ఈరోజు రమేష్ హెల్త్ కోసం పవన్ కళ్యాణ్ సార్ 5 లక్షల రూపాయలు పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా రమేష్‌కి ఎటువంటి అవసరం వచ్చినా తనే చూసుకుంటానని అన్నారు.. డాక్టర్లతో మాట్లాడుతున్నారు. అక్కడ చిరంజీవి సార్ మాట్లాడుతున్నారు, ఇక్కడ నాగాబాబు సార్ మాట్లాడుతున్నారు, ఇక్కడ హరిశంకర్ సార్ మాట్లాడుతున్నారు.. మాకైతే గుండె నిండా ధైర్యం ఇస్తున్నారు. మేము ఎప్పుడు కూడా.. మా కట్టె కాలే వరకు మా పవన్ కళ్యాణ్ సార్‌తోనే ఉంటాము. మా దేవుడికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం’’ అని అన్నారు.


గబ్బర్ సింగ్ టీమ్‌లోని రిమ్స్ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే మాట ఇచ్చారో.. ఆ మాట నిలబెట్టుకుని నూటికి నూరు శాతం ఈ రోజు మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. ఈరోజు శ్రీనివాస్ సార్‌తో 5 లక్షలు పంపించారు. ఇప్పటి వరకు మాకు ఒక కన్ఫ్యూజన్, ఒక బాధ, ఒక టెన్షన్ ఉంది. రమేష్‌ని షిఫ్ట్ చేస్తే ఎలా? అనే ఆలోచనలో ఉన్నాం. వెంటేనే సార్‌కి మేము మెసేజ్ ఫార్వర్డ్ చేశాం.. సార్ ఇట్లా ఉంది పరిస్థితి సార్ అంటే.. అక్కడి నుంచి మేము వస్తున్నాము, మనవాళ్ళు వస్తున్నారు అని చెప్పారు. సార్ ఇప్పుడే రావడం జరిగింది. 5 లక్షలు ఇచ్చారు. మిగతా ఎంత అమౌంట్ అయినా సరే.. రమేష్ డిశ్చార్జ్ అయ్యే వరకు పూర్తి భరోసా తనదేనని చెప్పారు. ఇక్కడి నుంచి ఎక్కడికీ షిఫ్ట్ చేయరు.. ఆయన ఇక్కడే ఉంటాడు, ఇక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. సార్.. మీ మేలు మా ఈ జన్మలో మర్చిపోము సార్. మేము ఏదైనా మాట్లాడితే.. ఎమోషనల్ అయిపోతున్నాం సార్. పవర్ స్టార్ సార్ నిజంగా మీరు దేవుడే! మీరు మాకు దేవుడే. మీరు చేసిన మేలు మర్చిపోలేము సార్.. ఎప్పటికీ మర్చిపోలేము సార్’’ అని తెలిపారు.


రమేష్ వైఫ్ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ సార్‌ థ్యాంక్యూ. మాకు ఇంత సహాయం చేశారు. నా భర్తని రక్షిస్తానని భరోసా ఇచ్చినందుకు థాంక్యూ సార్. మీకు పాదాభివందనాలు సార్..’’ అని భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే రమేష్ కుటుంబానికి మెగా బ్రదర్ నాగబాబు రూ. 2 లక్షలు, మెగాస్టార్ చిరంజీవి రూ. 3 లక్షలు ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

PelliChoopulu: విజయ్ దేవరకొండ విజయ విహారానికి పదేళ్ళు!

‘ఆదర్శ కుటుంబం’.. సంపూర్ణగా యువినా పార్థవి

చిత్ర పరిశ్రమ నాకు నేర్పింది ఇదే: శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Jul 29 , 2026 | 01:32 PM