విజయ్ కార్తీక్ కన్నన్ హ్యాట్రిక్.. ‘కాకా’ ప్రశంసలు!
ABN, Publish Date - Oct 17 , 2026 | 03:25 PM
‘జైలర్’, ‘డాకూ మహరాజ్’, ‘జైలర్ 2’ సినిమాలతో సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. చిరంజీవి ‘కాకా’ సినిమాతో మరో హిట్ అందుకుంటారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ 'జైలర్, డాకూ మహరాజ్, జైలర్ 2' సినిమాలతో హ్యాట్రిక్ సాధించారు. ఈ సందర్భంగా 'కాకా' సెట్లో చిత్ర బృందం విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించింది.
దసరా కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన 'జైలర్ 2' మూవీ విజయం వెనుక పెద్ద కథే ఉంది. వాస్తవానికి... ఓ సినిమా జనం ముందు నిలవడానికి ఎందరో సమష్టి కృషి అవసరం. ఏ మూవీ సక్సెస్ లోనైనా కేవలం స్టార్స్ పాత్రనే కాదు టెక్నీషియన్స్ పనితనమూ ఉంటుంది. ప్రస్తుతం గుడ్ టాక్ సంపాదించిన రజనీకాంత్ 'జైలర్-2' సక్సెస్ లో సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ పాత్ర కూడా ఉంది. అంతేకాదు 'జైలర్-2'తో విజయ్ కార్తిక్ కన్నన్ హ్యాట్రిక్ సాధించాడు. లోగడ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలోనే రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాకు కూడా విజయ్ కార్తిక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. తరువాత బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన 'డాకూ మహరాజ్' కు కూడా విజయ్ సినిమాటోగ్రాఫర్ గా తన పనితనం చూపించారు. ఆ మూవీ కూడా సక్సెస్ రూటులో సాగింది. ఆ తరువాత వచ్చిన చిత్రమే 'జైలర్-2'. ఇదీ విజయపథంలోనే పయనిస్తోందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఈ వరుస విజయాలతో సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ హ్యాట్రిక్ సాధించారని చెప్పొచ్చు. ఆ సక్సెస్సే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ లోనూ ఆశలు రేపుతోంది.
హీరో శివకార్తికేయన్ ద్వారా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు పరిచయం అయ్యారు విజయ్ కార్తిక్ కన్నన్. అలా 'డాక్టర్' సినిమాకు పనిచేశారు. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో విజయ్ కార్తిక్ కు అవకాశాలు రావడం మొదలయ్యాయి. తెలుగులో రవితేజ హీరోగా రూపొందిన 'రావణాసుర'కు పనిచేశారు విజయ్ కార్తిక్. ఆ సినిమాలో కొంత భాగాన్ని ప్రసాద్ మూరెళ్ళ, జీకే విష్ణు కూడా తమ కెమెరా పనితనంతో రూపొందించారు. 'రావణాసుర' పరాజయం పాలయింది. అయినా అదే యేడాది జనం ముందు నిలచిన తమిళ చిత్రం 'జైలర్' ఘనవిజయం సాధించింది. రజనీకాంత్ కు కూడా చాలా ఏళ్ళ తరువాత 'జైలర్'తో ఓ బిగ్ హిట్ ఆయన ఖాతాలో చేరింది. అది వచ్చాకే బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందించిన 'డాకూ మహరాజ్'కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు విజయ్ కార్తిక్ కన్నన్. ఈ మూవీ కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత విజయ్ కార్తిక్ కెమెరా పనితనంతో రూపొందిన చిత్రం 'జైలర్-2' కావడం విశేషం. ఇలా వరుస విజయాలు చూసిన విజయ్ కార్తిక్ కన్నన్ పై సినీజనాల్లోనూ మంచి నమ్మకం కుదిరింది.
రజనీకాంత్ 'జైలర్' రెండు భాగాల మధ్యలో బాలకృష్ణ 'డాకూ మహరాజ్'తో విజయ్ కార్తిక్ కన్నన్ హ్యాట్రిక్ సాధించారు. ఆయనే ఇప్పుడు చిరంజీవి 'కాకా' సినిమాకు కూడా వర్క్ చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ లో ఆశలు రెట్టింపయ్యాయి. 'కాకా' చిత్రానికి కూడా 'డాకూ మహరాజ్' డైరెక్టర్ బాబీనే దర్శకుడు కావడం గమనార్హం!. తమిళంలో నెల్సన్ కుమార్ రూపొందించిన 'జైలర్' సిరీస్ లో రెండు భాగాలూ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అందువల్ల తెలుగులోనూ దర్శకుడు బాబీ సినిమాలతో విజయ్ కార్తిక్ కన్నన్ సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే నిజమైతే జనవరి 13వ తేదీ రానున్న 'కాకా' సినిమా కూడా పొంగల్ బరిలో హంగామా చేస్తుందని సినీజనం అంటున్నారు. 'జైలర్-2'తో హ్యాట్రిక్ సాధించిన విజయ్ కార్తిక్ 'కాకా'తోనూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారనీ అభిమానుల అభిలాష. నెల్సన్ దర్శకత్వంలో వరుసగా రెండు చిత్రాలతో సక్సెస్ చూసిన విజయ్, బాబీతోనూ అదే ఫీట్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘కల్కి 2’ షూటింగ్పై అప్డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్
దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?
‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత