సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నా వైఫ్ మిస్సింగ్ అంటున్న వరుణ్ సందేశ్..

ABN, Publish Date - Oct 07 , 2026 | 08:07 PM

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో వరుణ్ సందేశ్ కూడా ఒకరు. 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' వంటి క్లాసిక్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరుణ్.. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా విజయాలు మాత్రం దక్కలేదు.

Na Wife Missing

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో వరుణ్ సందేశ్ (Varun Sandesh) కూడా ఒకరు. 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' వంటి క్లాసిక్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరుణ్.. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా విజయాలు మాత్రం దక్కలేదు. ఇక మధ్యలో కొన్నేళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన ఈమధ్య కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం 'నా వైఫ్ మిస్సింగ్. ఆహా ఒరిజినల్ ప్రెజెంటేషన్‌లో రూపొందుతున్న ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ కి స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహిస్తుంది.


ఇక కొత్త బంగారు లోకం తరువాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నా వైఫ్ మిస్సింగ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.టీజర్ లో మొదట వరుణ్, శ్వేతకు పెళ్లి చూపులు జరగడం, పెళ్లి కావడం.. ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించారు. ఇక పెళ్లి చూపుల్లోనే శ్వేత నేను వర్జిన్ కాదు అని చెప్పడంతో వరుణ్ లో అనుమానం పెరగడం చూపించారు. ఇక చివర్లో పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడం వంటి సన్నివేశాలతో టీజర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.


టీజర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సాయి కార్తీక్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఆహా ప్లాట్‌ఫారమ్‌లో అక్టోబర్ 22 నుంచి ఈ సినిమా ప్రీమియర్ కానుంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జోడీకి ఉన్న పాత క్రేజ్, పైగా కాన్సెప్ట్ కూడా ఎంతో మిస్టరీగా ఉండటంతో ఈ మూవీపై అప్పుడే డిజిటల్ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో ఈ జోడీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా

సంయమనం పాటిస్తున్నా.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన

బాలయ్య ‘దాదా’ షూటింగ్ విరామంలో మంచు మనోజ్ ఏం చేశారంటే..

Updated Date - Oct 07 , 2026 | 08:07 PM