మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా

ABN , Publish Date - Oct 07 , 2026 | 07:25 PM

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ షురూ అయింది. గత నెలలోనే మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావడంతో నందమూరి కాంపౌండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

Mokshagna Movie Launch Details

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) టాలీవుడ్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ షురూ అయింది. గత నెలలోనే మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావడంతో నందమూరి కాంపౌండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ భారీ చిత్రాన్ని ‘బింబిసార’తో టాలీవుడ్‌ను షేక్ చేసిన డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు ‘సింబా’ (Simba) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ మొదటి వారంలోనే లాంఛనంగా ప్రారంభం కాబోతోందట. ఇప్పటికే ఈ మూవీ కథను బాలయ్య బాబు స్వయంగా విన్నారని.. కథలో కొన్ని చిన్న చిన్న సూచనలు, మార్పులు చెప్పడంతో దర్శకుడు వశిష్ఠ ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞను ఏదో రొటీన్ మాస్ యాక్షన్ కథతో కాకుండా, చాలా కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య ప్లాన్ చేశారట. అందుకే విజువల్ ఎఫెక్ట్స్, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మల నేపథ్యంతో కూడిన ఒక మైండ్ బ్లోయింగ్ సోషియో-ఫాంటసీ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారట.


ఇక ఈ సినిమాలో నటించే తారాగణం విషయంలోనూ మేకర్స్ అస్సలు తగ్గడం లేదు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అలాగే సీనియర్ నటీమణులు రవీనా టాండన్, శోభన కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.​ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. ఈ సినిమాలో స్వయంగా బాలకృష్ణ కూడా ఒక అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారట. రియల్ లైఫ్‌లో లాగే రీల్ లైఫ్‌లోనూ మోక్షజ్ఞకు తండ్రి పాత్రలోనే నటసింహం కనిపిస్తారని సమాచారం. తండ్రీ కొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని కోరుకుంటున్న అభిమానుల కల ఈ సినిమాతో నెరవేరబోతుందన్నమాట. ఈ కాస్టింగ్ పై డిసెంబర్‌లోనే పూర్తి క్లారిటీ రానుంది.


ఇదిలా ఉంటే, డిసెంబర్ నెల నందమూరి అభిమానులకు నిజంగానే ‘డబుల్ ధమాకా’ (Double Dhamaka) అని చెప్పాలి. ఒకవైపు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఓపెనింగ్ జరుపుకోనుండగా.. మరోవైపు బాలయ్య ‘దాదా’ మూవీ విడుదల కానుంది. ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘దాదా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.​ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న బాలయ్య బాబు మళ్లీ ‘దాదా’ (Dada Movie) సెట్స్‌లో అడుగుపెట్టి షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారట. మొత్తానికి డిసెంబర్‌లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ అండ్ బాలయ్య ‘దాదా’ హంగామాతో బాక్సాఫీస్ దగ్గర నందమూరి జాతర ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

సంయమనం పాటిస్తున్నా.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన

బాలయ్య ‘దాదా’ షూటింగ్ విరామంలో మంచు మనోజ్ ఏం చేశారంటే..

2 కోట్లతో 400 కోట్లు.. మాకు చెంపపెట్టులా ఉంది: మైత్రీ రవిశంకర్

Updated Date - Oct 07 , 2026 | 07:25 PM