సంయమనం పాటిస్తున్నా.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:55 PM
గత కొద్ది రోజులుగా బండ్ల గణేష్ పేరుతో రాజకీయంగా, ఇండస్ట్రీ పరంగా పలు రకాల రూమర్లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బండ్ల గణేష్.. తాజాగా బహిరంగ లేఖను విడుదల చేశారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఆయన చేసే కామెంట్లు ఎప్పుడూ సెన్సేషనే. అయితే గత కొద్ది రోజులుగా ఆయన పేరుతో రాజకీయంగా, ఇండస్ట్రీ పరంగా పలు రకాల రూమర్లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బండ్ల గణేష్.. తాజాగా ఒక అధికారిక బహిరంగ లేఖను విడుదల చేశారు. తనను అనవసర వివాదాల్లోకి లాగవద్దంటూ ఘాటుగా స్పందించారు.
ఆత్మీయులందరికీ నమస్కారాలు తెలుపుతూ లేఖను ప్రారంభించిన బండ్ల గణేష్.. ‘‘నాకు ఎలాంటి పదవులు, హోదాలు, అధికారాలపై వ్యామోహం లేదు. ప్రజలు ఇన్నేళ్లుగా అందించిన ప్రేమ, అభిమానంతో నేను సంపాదించుకున్న గౌరవమే నాకు ఎంతో విలువైనది. నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఆలోచనలు, నా ప్రయాణం, నేను ఎవరో నన్ను దగ్గరగా చూసిన వారికి స్పష్టంగా తెలుసు.దయచేసి లేనిపోని విషయాలను నా పేరుతో ముడిపెట్టకండి. నా ప్రమేయం లేని అంశాల్లో నా పేరును ఉపయోగించవద్దు. నేను చెప్పనిది నా మాటగా, నేను చేయనిది నా పనిగా ప్రచారం చేయడం సరికాదు. రూమర్స్‌కు, గాలి వార్తలకు స్పందించకపోవడం నా సంయమనం మాత్రమే. నా పేరును అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంచండి’’ అంటూ హెచ్చరించారు.
నా పేరుపై రాజకీయం చేయొద్దు!
చివరగా తనదైన శైలిలో తేల్చిచెబుతూ.. ‘‘నా పేరు మీద రాజకీయాలు చేయకండి.. నా పేరును రాజకీయాలకు ఉపయోగించకండి’’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలు, ఇండస్ట్రీ అంతర్గత వివాదాల నేపథ్యంలో బండ్ల గణేష్ పేరు తెరపైకి రావడంపై ఆయన ఈ లేఖ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఇకనైనా బండ్ల గణేష్‌పై ప్రచారం అవుతున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
బాలయ్య ‘దాదా’ షూటింగ్ విరామంలో మంచు మనోజ్ ఏం చేశారంటే..
2 కోట్లతో 400 కోట్లు.. మాకు చెంపపెట్టులా ఉంది: మైత్రీ రవిశంకర్
మళ్లీ తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్‌న్యూస్