సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 12 , 2026 | 06:13 PM

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో ఉన్న రామాయణ ఘట్టంపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rajamouli About Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ సరికొత్త వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది.


అదేంటంటే.. ‘వారణాసి’ సినిమాలో రామాయణానికి సంబంధించిన ఒక పవర్‌ఫుల్ ఘట్టం ఉండబోతుందనే ప్రచారం. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాజమౌళి.. రామాయణం (Ramayanam) వంటి గొప్ప ఇతిహాసాలను సినిమాల్లో చూపించే విధానంపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. గతంలో వచ్చిన పౌరాణిక చిత్రాలు ఎన్నో తనకు నచ్చినప్పటికీ.. రామాయణం వంటి గొప్ప గ్రంథాలకు తెరపై పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందని తాను భావించలేదని ఆయన పేర్కొన్నారు. ఇతిహాసాలను రచించిన విధానానికి, వాటిని వెండితెరపై ఆవిష్కరించే తీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఈ అంశం తనను ఎన్నో ఏళ్లుగా ఆలోచింపజేసిందని, అందుకే దీన్ని ఒక సవాల్‌గా తీసుకున్నానని చెప్పారు. ‘ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? ఆ కథను ఎలా చూపించబోతున్నావు?’ అని తనను తాను ప్రశ్నించుకున్నానని.. ఆ ఆలోచనే ‘వారణాసి’లో రామాయణ ఘట్టాన్ని రూపొందించడానికి ప్రధాన ప్రేరణగా నిలిచిందని జక్కన్న తెలిపారు.


ఇక ‘వారణాసి’లో రామాయణానికి సంబంధించిన ఒక ఘట్టాన్ని చూపించే అవకాశం తనకు లభించిందని ఆయన వెల్లడించారు. ఈ ఎపిసోడ్‌ను కేవలం భారీ విజువల్స్‌తోనే కాకుండా.. పాత్రల మధ్య ఉండే లోతైన భావోద్వేగాలను కూడా ప్రేక్షకులకు బలంగా చేరవేసేలా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వివరించారు. పౌరాణిక కథల్లో అద్భుతమైన దృశ్యాలు ఎంత ముఖ్యమో.. పాత్రల వెనుక ఉన్న భావాలు, అంతరార్థం కూడా అంతే ముఖ్యం అని రాజమౌళి భావిస్తున్నారు. తనదైన దర్శకత్వ శైలి, అత్యాధునిక సాంకేతికతతో ఈ ఘట్టాన్ని ఆయన ఒక విజువల్ వండర్‌గా మలచబోతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘వారణాసి’ చిత్రంలోని ఈ రామాయణ ఘట్టానికి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. రాముడు, హనుమంతుడు, వానర సైన్యానికి మరోవైపు కుంభకర్ణుడికి మధ్య జరిగే భీకర యుద్ధాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే.. థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ పక్కా అని చెప్పవచ్చు. మరి ఈ రామాయణ ఘట్టం సినిమాకు ఏ విధంగా హైలైట్ అవుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి:

30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు

మూడు ప్రాజెక్ట్‌లతో మెగా హీరో షాకివ్వబోతున్నాడా..

అన్న కంటే భిన్నంగా.. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం

Updated Date - Oct 12 , 2026 | 06:13 PM