సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: హాలీవుడ్‌కు గట్టి పోటీ.. వారణాసితో రాజమౌళి టార్గెట్ ఇదేనా?

ABN, Publish Date - Oct 12 , 2026 | 03:18 PM

వారణాసి రిలీజ్ విషయంలో  ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించేలా రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు తెలుస్తోంది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu) దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించేలా సినిమా విడుదలకు రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 60–65 వేల స్క్రీన్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, చైనా మార్కెట్లలో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రాజమౌళి వివిధ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ముందుకెళ్తోందని, ఉత్తర అమెరికాలో కనీసం 50 మిలియన్ డాలర్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 

ఈ స్థాయిలో వసూళ్లను ఆశించడం హాలీవుడ్ స్థాయి సినిమాలకే సవాలుగా ఉండే అంశం. అయినా రాజమౌళి తగ్గడం లేదు. హాలీవుడ్ సినిమాలకు దీటుగా విడుదల చేయాలనీ, సినిమా ప్రపంచ స్థాయిలో మారుమోగి పోవాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు తెచ్చిన ఆయనకు ఇదేమి పెద్ద కష్టం కాదని అభిమానులు చెబుతున్నారు. దీనితో మహేశ్‌బాబు క్రేజ్‌కు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ తోడైతే అంతర్జాతీయ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదవుతాయన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.  ఇంత భారీగా జక్కన్న ప్లాన్స్ ఉన్నాయంటే.. అసలు మహేష్ తో ఆయన ఎలాంటి కథను వండాడో అన్న ఆసక్తి కూడా కలుగుతోంది..  

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’ న్యూ పోస్టర్ అదిరింది.. అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్

సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం

ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి.. అంతర్జాతీయ పురస్కారం

Ganesh Acharya: గణేష్‌ ఆచార్య జీవితంలో ఇన్ని కష్టాలా? బయోపిక్‌ ట్రైలర్‌ ఆసక్తికరం!


Updated Date - Oct 12 , 2026 | 04:02 PM