ఫస్ట్ టైమ్ డబ్బింగ్ కళాకారులకు ‘వాగ్దేవి అవార్డ్స్’
ABN , Publish Date - May 11 , 2026 | 05:09 PM
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ ప్రథమ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా జరిపారు. మే 10, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ, టీవీ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ (TTDMODAUT) ప్రథమ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా జరిపారు. మే 10, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ, టీవీ ప్రముఖులు పాల్గొన్నారు. వారి సమక్షంలో మొట్టమొదటిసారిగా పలు డబ్బింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డబ్బింగ్ కళాకారులకు ‘వాగ్దేవి అవార్డ్స్’ను బహూకరించారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా నవీన్ యాదవ్ (జూబ్లీహిల్స్ శాసనసభ్యులు), ఈ గంగాధర్ (అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్, తెలంగాణ), నటుడు రాజీవ్ కనకాల, ఏ. ప్రసాదరావు (ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్), కొయ్యలమూడి రాకేష్ (నాని) (TTDWTF ప్రెసిడెంట్), గోగినేని ప్రసాద్ (మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్), పి. ప్రభాకర్ (సినీ, టీవీ నటులు), కాదంబరి కిరణ్ (సినీ నటులు), ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ Rcm రాజు (టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు) తదితరులు పాల్గొన్నారు.

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ కార్యవర్గ సభ్యులైన ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ లలితా రాజ్, జనరల్ సెక్రెటరీ C.N . గౌతమ్, ట్రెజరర్ పి. వినోద్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సాహితి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ శ్యాంసుందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి అనురాధ, సాయి ప్రసాద్, సునీల్ రెడ్డి, సమరసింహారెడ్డి, అనిల్ కుమార్ వంటి వారి నిర్వహణలో డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రతిభను గుర్తిస్తూ.. మొట్టమొదటిసారి ఈ అవార్డులను అందించడం చాలా గొప్ప విషయమని అతిథులు కొనియాడారు.
ఇవి కూడా చదవండి:
అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి