సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trivikram: 'సింగ్ గీతం' మీరు దేని కోసం చూస్తారు!?

ABN, Publish Date - Jun 11 , 2026 | 11:58 AM

సింగ్‌ గీతం మూవీని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కోసం తాను చూస్తానని ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తెలిపారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతోంది.

Trivikram

ప్రముఖ దర్శకులకు అభిమానుల ప్రేక్షకులు ఉంటారు. కానీ దర్శకులకే అభిమాన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన్ని అభిమానించే దర్శకులు ఎందరో ఉన్నారు. 94 సంవత్సరాల వయసులో సింగీతం శ్రీనివాసరావు (Singeetham Sreenivasa Rao) తెరకెక్కించిన 'సింగ్‌ గీతం' (Sing Geetham) సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్‌ ప్రారంభం కాగానే తొలి టిక్కెట్‌ను దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆ సినిమా మీద, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మీద తనకున్న అభిమానాన్ని అలా చాటుకున్నారు.


ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) సైతం సింగీతం శ్రీనివాసరావు పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ, ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌... విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) తో 'ఆనంద నిలయం' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన మాట్లాడుతూ, 'సింగీతం శ్రీనివాసరావు గారు పాత్ బ్రేకింగ్‌ ఫిల్మ్ మేకర్. తన టైమ్స్ కంటే అన్నీ ముందుగా ఉండే సినిమాలే తీశారు. ఫస్ట్ టైమ్‌ ఇండియన్ స్క్రీన్ మీద ఒక మరుగుజ్జుతో సినిమా తీశారు. నాలుగు పాత్రలతో సినిమా తీశారు. అసలు మాటలు లేకుండా సినిమా తీశారు. ఇంత టైమ్‌ అయిన తర్వాత కూడా ఇంకా మనకెవ్వరికీ రాని ఆలోచనతో సినిమాను తీశారు. అదే మొత్తం పాటలతో సినిమా. దాని పేరు 'సింగ్‌ గీతం'. ఒక రకంగా చెప్పాలంటే ఇది గ్రేట్‌ ఫిల్మ్ మేకర్‌కు మనం ఇచ్చే నివాళి. కొన్ని సినిమాలు హీరో కోసం చూస్తాం, కథ కోసం చూస్తాం. నేనైతే ఈ సినిమా సింగీతం శ్రీనివాసరావు గారి కోసం చూస్తాను. మీరు దేనికోసం చూస్తారు?' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Krishnam Raju: ఆరు పదుల.. రెబల్ స్టార్!

బుట్టబొమ్మకి తప్పని ‘ఐరన్ లెగ్’ శాపం..

Ravi Mohan: భార్య‌కు నెల‌కు రూ.40 ల‌క్ష‌ల భ‌ర‌ణం.. హీరో ర‌వి మోహ‌న్‌కు కోర్టులో చుక్కెదురు

Updated Date - Jun 11 , 2026 | 12:02 PM