బుట్టబొమ్మకి తప్పని ‘ఐరన్ లెగ్’ శాపం..
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:04 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) కు బ్యాడ్ టైమ్ ఇంకా పోలేదా అంటే పోలేదనే చెప్పాలి. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని ఊపేసిన బుట్టబొమ్మ, గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) కు బ్యాడ్ టైమ్ ఇంకా పోలేదా అంటే పోలేదనే చెప్పాలి. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని ఊపేసిన బుట్టబొమ్మ, గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తరువాత ఒకటి కాదు రెండు కాదు అరడజన్ సినిమాలు చేసింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసీకా భాయ్ కిసీకా జాన్, సర్కస్, దేవా, రెట్రో.. ఇలా వరుసగా వచ్చిన ప్రతి సినిమా పరాజయాన్ని అందుకున్నదే. దీంతో పూజా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ హీరోయిన్ గా మారింది. గత కొన్నిరోజుల నుంచి పూజా హై జవాని తో ఇష్క్ హోనా హై సినిమాపైనే అన్నీ ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూసింది పూజా. అందులో ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కూడా మరో హీరోయిన్ గా నటించడంతో మంచి విజయం దక్కుతోందని భావించింది.
ఎన్నో అంచనాల మధ్య జూన్ 5న విడుదలైన హై జవాని తో ఇష్క్ హోనా హై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పాతచింతకాయ పచ్చడి లాంటి కథ, రొటీన్ కామెడీ కావడంతో ప్రేక్షకులను ఈ చిత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా పూజా, మృణాల్ ఆరబోసిన అందాలు కూడా వర్క్ అవుట్ కాలేదు. వీకెండ్‌తో పాటు వర్కింగ్ డేస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్లు చాలా డల్‌గా పడిపోయాయి. వరుణ్ ధావన్ క్రేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది, దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది.
ఇక ఈ సినిమా రిజల్ట్‌తో పూజా హెగ్డే కెరీర్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను మళ్లీ ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకోపక్క సినిమాలు పరాజయాలు అందుకుంటున్నా కూడా అమ్మడు మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ అందరికీ షాక్ ఇస్తుంది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. విజయ్ సరసన నటించిన జననాయగన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇది కాకుండా కాంచన 4 లో ఛాన్స్ పట్టేసింది. ఈ రెండు కూడా మరో కొత్త ప్రాజెక్ట్ కి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు సమాచారం. మరి పూజా హెగ్డేని ఈ నెగెటివ్ ట్యాగ్ నుండి బయటపడేసే సినిమా ఎంతో చూడాలి.
ఇవి కూడా చదవండి:
భారతీరాజా అంత్యక్రియల్లో తీవ్ర కలకలం.. బంధువులపై సింగర్ ఆగ్రహం
కన్నీళ్ళు పెట్టిస్తోన్న భారతీరాజా చివరి వీడియో..
Drishyam 3: అందుకే.. వెంకటేశ్‌తో దృశ్యం 3 రీమేక్ చేయలేదు! అసలు గుట్టు.. బయట పెట్టిన డైరెక్టర్