క్లాప్ కూడా కొట్టలేదు.. అప్పుడే! క్రేజ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:20 PM
సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి.. అటు చిరు, ఇటు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇలా వరసగా సంక్రాంతికి సక్సెస్‌లు చెప్పి మరీ ఇస్తుండటంతో.. అనిల్ రావిపూడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో రెండో రాజమౌళి (SS Rajamouli)గా పిలవబడుతోన్న దర్శకుడు ఎవరయ్యా? అంటే, వెంటనే వచ్చే పేరు ‘అనిల్ రావిపూడి’ (Anil Ravipudi). ఇప్పటి వరకు అనిల్ రావిపూడి చేసిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి.. అటు చిరు, ఇటు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇలా వరసగా సక్సెస్‌లు చెప్పి మరీ ఇస్తుండటంతో.. అనిల్ రావిపూడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. అయినా సరే, తన ఫార్ములాను, ట్రాక్ రికార్డును వదలకుండా కంటిన్యూ చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇప్పుడాయన చేస్తున్న సినిమాకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అనిల్ రావిపూడి.. తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. వరసగా సంక్రాంతి పండుగలను టార్గెట్ చేస్తూ వస్తున్న అనిల్ రావిపూడి, రాబోయే సంక్రాంతి రేసులో కూడా తన సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించేశారు. ఈసారి ఆయన విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), కళ్యాణ్ రామ్ (Kalyan Ram)లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. కృతిశెట్టి ఒక హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. మరో హీరోయిన్ ప్లేస్‌లో కీర్తి సురేష్ పేరు వినబడుతోంది. ఇక అసలు విషయం ఏమిటంటే. ఈ సినిమా ఇంత వరకు పూజా కార్యక్రమాలే జరుపుకోలేదు. కానీ, ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది.
అనిల్ రావిపూడి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాల ఓటీటీ రైట్స్ దక్కించుకున్న జీ5 ఓటీటీ (Zee5) సంస్థే, ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది. ప్రస్తుతం అన్నీ పూర్తై కూడా ఓటీటీ డీల్ పూర్తికాక సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడిపై ఉన్న నమ్మకంతో సదరు ఓటీటీ సంస్థ, అసలేం ఆలోచించకుండా రైట్స్ దక్కించుకోవడం మాములు విషయం కాదు. అందుకే అన్నది.. క్రేజ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి మారాడని. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ఇవి కూడా చదవండి:
దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్
అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!
షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?
‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!