Anil Ravipudi: రఫ్పాడిస్తాను.. బాక్స్‌ బద్దలైపోద్ది డైలాగులుంటాయి.. కానీ..

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:17 PM

‘చిరంజీవి, వెంకటేశ్‌లతో ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నాను. అవకాశం వస్తే చిరు, బాలయ్య ఇద్దరితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా.

‘చిరంజీవి, వెంకటేశ్‌లతో ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నాను. అవకాశం వస్తే చిరు, బాలయ్య ఇద్దరితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. బాలకృష్ణతో కలిసి చేసేందుకు సిద్థంగా ఉన్నానని చిరంజీవిగారు ఈ మధ్యనే ఓ వేడుకలో చెప్పారు. అయితే ఇద్దరిని బ్యాలెన్స్‌ చేసి, అంచనాలకు సరిపడ కథ కుదిరితే నేనే కాదు ఏ దర్శకుడు అయినా సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే ఈ ఇద్దరివీ డిఫరెంట్‌ మ్యానరిజమ్స్‌. వారికి సరిపోయే కథ దొరికితే అప్పుడు చూద్దాం’ అని అనిల్‌ రావిపూడి అన్నారు. శుక్రవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనిల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రం బృందం మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లను చూస్తూ పెరిగాను. ఇప్పుడు వారందరి సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో చిరంజీవి గారి మొదటి సన్నివేశాన్ని మానిటర్‌లో చూసినప్పుడు చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాను. చిరంజీవిగారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఈ సినిమాలో చూస్తారు. గత చిత్రాల్లో ఆయన మ్యానరిజమ్స్‌ ఉపయోగించానా అంటే దానికి ఇప్పుడు ఏమీ చెప్పలేను. అవన్నీ  థియేటర్‌లోనే చూడాలి. ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడిస్తాను’, ‘బాక్స్‌ బద్దలైపోద్ది’ వంటి డైలాగ్‌లు వింటారు. నాకు కుదిరిన ప్రతిసారీ ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘పండగకు వస్తున్నాం’ ఇలానే పెడతాను. ఈ సినిమాలో క్లాస్‌, మాస్‌ ఎంతనేది కూడా ఇప్పుడే చెప్పను.  కానీ, ఎక్కువమంది ఆడియన్స్‌కు రీచ్‌ అయ్యేలా ప్రయత్నం చేశాను. క్లాస్‌, మాస్‌ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా కోసం నేను చెప్పినవన్నీ చిరంజీవి గారు అంగీకరించారు. అదే నాకు పెద్ద సంతోషం. ఇక టైటిల్‌ విషయానికొస్తే. ఆయన ఒరిజినల్‌ పేరే పాత్రకు ఉంటే బాగుండు అనిపించింది. అందుకే దాన్నే సినిమా టైటిల్‌గా పెట్టా. ఈ సినిమాలో కనిపించాలనే కోరిక నాకూ ఉంది. అందుకే వెంకటేశ్‌, చిరంజీవి మధ్యలో అలా కనిపించి.. ఇలా వెళ్తాను. షూటింగ్‌ల బంద్‌ వల్ల మా సినిమా షెడ్యూల్‌ ఏదీ ఆగలేదు.          

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ
నాన్నగారి పుట్టినరోజున ఆయనతో లేకుండా మీ అందరి ముందు ఇలా ఉండడం బహుశా ఇదే ఫస్ట్ టైం. ఇది వెరీ స్పెషల్ మూమెంట్. అనిల్ గారికి సాహు గారికి థాంక్యూ. ఇది నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇదే స్టైల్ తో ఇంకా ఎనర్జీతో సంక్రాంతికి వస్తున్నాం. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నాన్నే మాకు స్ఫూర్తి. ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం లుక్‌ను మార్చుకున్నారు. ఆ లుక్‌కు తగినట్లే మేం కాస్ట్యూమ్స్‌ తయారు చేశాం'

Updated Date - Aug 22 , 2025 | 05:19 PM