‘జంగా’లో శివగా త్రిగుణ్.. రా అండ్ రస్టిక్ పోస్టర్ వైరల్
ABN, Publish Date - Oct 31 , 2026 | 06:32 PM
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో త్రిగుణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం ‘జంగా’. ఈ సినిమాలో శివగా త్రిగుణ్ కనిపించనున్నారు.
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో త్రిగుణ్ (Thrigun) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం ‘జంగా’ (Jangaa). శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కెవిన్ గడ్డం (శ్రీహరి) కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్స్ సినీ ప్రియుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర బృందం హీరో త్రిగుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ఈ చిత్రంలో త్రిగుణ్.. ‘శివ’ (Siva) అనే పల్లెటూరి యువకుడి పాత్రలో పూర్తి రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, అమాయకత్వంతో కూడిన చిరునవ్వుతో సైకిల్ పక్కన నిల్చున్న త్రిగుణ్ లుక్ చాలా నేచురల్‌గా, ఆకట్టుకునేలా ఉంది. ‘వెన్ లవ్ బర్న్స్.. శివ అవేకన్స్’ అనే క్యాప్షన్ కథలోని లోతైన భావోద్వేగాలను, ప్రతీకార కోణాన్ని సూచిస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రస్తుతం బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఇంట్లో తనదైన ఆటతీరుతో రచ్చ చేస్తూ విన్నర్ రేసులో దూసుకుపోతున్న త్రిగుణ్.. అటు వెండితెరపై కూడా ‘శివ’గా సరికొత్త మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో నేహా పఠాన్ హీరోయిన్గా నటిస్తుండగా, పవర్ఫుల్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ, సమీర్, నాగ మహేష్, భూపాల్ రాజు, రఘు కారుమంచి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతికంగానూ ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. కృష్ణ సౌరభ్ సురంపల్లి సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి. దిలీప్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ సంభాషణలు సమకూర్చుతున్నారు. చిత్రీకరణను వేగంగా పూర్తి చేసుకుంటున్న ‘జంగా’ చిత్రం నుంచి త్వరలోనే టీజర్, పాటలతో పాటు మరిన్ని క్రేజీ అప్డేట్లను వరుసగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
జాన్వీ కపూర్ పై తెలుగు ఫ్యాన్స్ ఫైర్.. టాలీవుడ్లో ఇక కష్టమేనా?
తెలుగులో మరో ‘తారే జమీన్ పర్’.. ట్రైలర్ విడుదల
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్