Jangaa: ‘జంగా’లో మధునందన్ క్యారెక్టర్ పోస్టర్ వైరల్

ABN , Publish Date - Oct 01 , 2026 | 09:22 PM

టాలెంటెడ్ యంగ్ హీరో త్రిగుణ్ కథానాయకుడిగా నటిస్తోన్న సరికొత్త రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జంగా’. ఈ మూవీలో మధునందన్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు.

Madhunandan in Jangaa

టాలెంటెడ్ యంగ్ హీరో త్రిగుణ్ కథానాయకుడిగా నటిస్తోన్న సరికొత్త రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జంగా’ (Jangaa). శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కెవిన్ గడ్డం (శ్రీహరి) కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే త్రిగుణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి.


తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నటుడు మధునందన్ (Madhunandan) పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మధునందన్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆయన ఖాకీ యూనిఫామ్‌లో గంభీరంగా, ఏదో కేసును లేదా సంఘటనా స్థలాన్ని తదేకంగా పరిశీలిస్తున్నట్లు కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఆయన కళ్లలోని ఇంటెన్సిటీ చూస్తుంటే.. కథను మలుపు తిప్పే కీలకమైన దర్యాప్తు అధికారి పాత్రలో ఆయన కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ పోలీస్ ఆఫీసర్ దేనిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఈ చిత్రంలో నేహా పఠాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ వరలక్ష్మీ శరత్‌కుమార్, శ్రావణ్, గగన్ విహారి, చందు గౌడ, సమీర్, నాగ మహేష్, భూపాల్ రాజు, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ‘జంగా’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి:

పవన్ ‘తీన్‌మార్’ హిట్ కాదని ముందే తెలుసు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

అమల అక్కినేని ఆవిష్కరించిన ‘శివ రూపాయ విష్ణవే’!

చేతి కట్టు తీసి మరీ అభిమానిని హత్తుకున్న తారక్.. వీడియో వైరల్

Updated Date - Oct 01 , 2026 | 09:22 PM