రామ్ చరణ్- సారా లుక్ టెస్ట్ అయింది.. ఇక షూటింగే తరువాయి
ABN, Publish Date - Oct 30 , 2026 | 03:10 PM
రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan), క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (sukumar) కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్.. ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం పూర్తిగా మారిపోతున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం రామ్ చరణ్ లుక్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో చరణ్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త అల్ట్రా స్టైలిష్ అవతారంలో కనిపించబోతున్నారు.
ఈ పాత్ర కోసం మెగా పవర్ స్టార్ బాగా బరువు తగ్గడంతో పాటు, లాంగ్ హెయిర్‌తో కనిపించనున్నట్లు సమాచారం. నిజానికి 'పెద్ది' సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. చరణ్ ఇప్పటివరకు తన హెయిర్ స్టైల్ మార్చకపోవడానికి కారణం ఇదేనట. 'రంగస్థలం' సినిమాలో ఊరమాస్ చిట్టిబాబుగా మనందరినీ అలరించిన చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో ఈసారి ఏకంగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ లెవెల్స్ వేరే లెవెల్‌కి వెళ్లిపోయాయి.
ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే దానిపై కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ (Sara Arjun) ఈ చిత్రంలో చరణ్ సరసన కనిపించనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. తాజాగా జరిగిన లుక్ టెస్టులో సారా అర్జున్ కూడా పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని నవంబర్ 1వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవిశంకర్ ఇప్పటికే ప్రకటించారు. పూజా కార్యక్రమం సందర్భంగా చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను మేకర్స్ అధికారికంగా రివీల్ చేయనున్నారట. అంతేకాదు ఓపెనింగ్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, అనిరుధ్ మ్యూజిక్, సుకుమార్ టేకింగ్, చరణ్ స్టైలిష్ యాక్టింగ్ కలిస్తే థియేటర్లలో పూనకాలే అని చెప్పవచ్చు. ఇక రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత చరణ్, సుకుమార్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.