సీఎం విజయ్ మంచి మనసు..సైగలతో అభ్యర్థించిన దివ్యాంగుడికి ఉద్యోగం
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:32 AM
నిరుద్యోగినైన తనకు జీవనం గడపడం కష్టంగా ఉందంటూ సైగలతో మొర పెట్టుకున్న ఓ దివ్యాంగునికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 24 గంటల్లో ఉద్యోగం కల్పించారు.
నిరుద్యోగినైన తనకు జీవనం గడపడం కష్టంగా ఉందంటూ సైగలతో మొర పెట్టుకున్న ఓ దివ్యాంగునికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) 24 గంటల్లో ఉద్యోగం కల్పించారు. చెన్నై గిండిలోని ప్రభుత్వ వృత్తివిద్యా శిక్షణ సంస్థలో బుధవారం ఉదయం ఏర్పాటైన కార్యక్రమంలో సీఎం పాల్గొనగా.. దినేశ్ (Dinesh) అనే దివ్యాంగ యువకుడు (differently abled youth) వెళ్లి చిన్న కాగి తాన్ని అందించి తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. ఆ సైగలను అర్థం చేసుకున్న విజయ్ తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దినేశ్ ఇచ్చిన కాగితాన్ని కోటు జేబులో పెట్టుకుని సచివాలయానికి తిరిగి వెళ్లారు.
కాగా, గురువారం ఉదయం సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకోవాలంటూ దినేశ్‌కు సమాచారం అందింది. దీంతో సచివాలయానికి వెళ్లిన దివ్యాంగునికి ముఖ్యమంత్రి విజయ్ కరచాలనం చేసి ఉద్యోగ నియామక పత్రం అందించారు. స్థానిక తిరువొత్తియూరులోని ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో సహాయకుడి పోస్టులో అతనిని నియమించినట్టు ఆ ఉత్తర్వుల్లో పాల్గొన్నారు. దీంతో దినేశ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.