‘ది బ్రేకింగ్ న్యూస్’.. మురళీ మోహన్‌కు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్!
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:29 PM
మెగాస్టార్ చిరంజీవి, మురళీ మోహన్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. అలాంటిది మురళీ మోహన్ అడిగితే, చిరంజీవి సపోర్ట్ చేయకుండా ఉండగలరా? తప్పకుండా చేస్తారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మురళీ మోహన్ (Murali Mohan) మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. అలాంటిది మురళీ మోహన్ అడిగితే, చిరంజీవి సపోర్ట్ చేయకుండా ఉండగలరా? తప్పకుండా చేస్తారు. అసలు విషయం ఏమిటంటే.. మీడియా నేపథ్యంతో రూపుదిద్దుకుంటోన్న థ్రిల్లర్ చిత్రం ‘ది బ్రేకింగ్ న్యూస్’ (The Breaking News). తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. సీనియర్ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘నేను ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన కోసం ఈ సినిమా తప్పకుండా చూస్తాను. అలాగే అనన్య నాగళ్ల మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, వైవిధ్యంగా రూపొందిస్తున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా మంచి విజయం సాధించి, నిర్మాతలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
అనంతరం చిత్రబృందం మాట్లాడుతూ.. ఈ సినిమా మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా రూపొందుతోంది. 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌ఫుట్ చూసి అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాకు సీనియర్ నటుడు మురళీ మోహన్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అందరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. ఫస్ట్ లుక్ వదిలిన మెగాస్టార్‌కు మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.
మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?