Chiranjeevi: చరణ్‌, జాన్వీని అలా చూడాలనుంది!

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:14 PM

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రానికి సీక్వెల్‌లో రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ కలిసి యాక్ట్‌ చేస్తే చూడాలన్నది తన కల అని దాని కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా అని ఆయన అన్నారు.

Chiranjeevi:  చరణ్‌, జాన్వీని అలా చూడాలనుంది!
Chit Chat with Chiranjeevi


 
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka Sundari) రెండో భాగంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రానికి సీక్వెల్‌లో రామ్‌చరణ్‌(Ram charan), జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) కలిసి యాక్ట్‌ చేస్తే చూడాలన్నది తన కల అని దాని కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా అని ఆయన అన్నారు. త్వరలోనే జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మార్చిలో జరిగిన సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో రాజీవ్‌ మసంద్‌ అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానమిచ్చారు.

‘‘సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పుడు నేనెప్పుడూ పెద్ద స్టార్‌ని అవుతానని, మెగాస్టార్‌ ట్యాగ్‌ వస్తుందని అనుకోలేదు. నా కష్టం, ప్రతిభపై ఉన్న నమ్మకంతో మంచి స్థానంలో ఉంటానని అనుకున్నా. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. దాని ఫలితమే ఈ రోజు ఈ స్థ్థాయిలో ఉన్నా. నాకు మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు. నా అభిమానుల ప్రేమను ఎప్పటికీ కొలవలేను. నా అభిమానులు  మాస్‌ సినిమాల్లో నన్ను చూడాలనుకునేవారు. నాకేమో క్లాసికల్‌ సినిమాలు చేయాలని ఉండేది. ‘ఖైదీ’ నాకు  స్టార్‌ స్టేటస్  ఇచ్చింది. నన్ను చాలా పైకి తీసుకెళ్లింది. అందులోని యాక్షన్‌ సీన్స్‌, డ్యాన్స్‌లు,, భావోద్వేగ సన్నివేశాలు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘శుభలేఖ’లాంటి చిత్రాలను కూడా ప్రేక్షకులు చక్కగా ఆదరించారు.

Shraddha Das: శ్రద్ధ దాస్ గ్లామర్ పర్వం

Chiru-2.jpg
పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను.. 
‘‘చరణ్‌తో కలిసి జాన్వీ ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ మధ్యనే తను మా ఇంటికి వచ్చింది. ఆమెతో మాట్లాడుతుంటే కొంచెం భావోద్వేగంగా అనిపించింది. శ్రీదేవి గుర్తుకువచ్చింది. ఇండస్ర్టీ మంచి నటిని కోల్పోయింది. ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండో భాగంలో చరణ్‌, జాన్వీ నటిస్తే చూడాలని ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు సినిమాలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం కోరుకునే పాత్రలు అన్ని సందర్భాల్లోనూ రావు. వాటంతట అవే స్వయంగా రావాలి. నాకు ఫ్రీడమ్‌ ఫైటర్‌గా చేయాలని ఉండేది. ఆ కోరికతోనే ‘సైరా’ చేశాను. ఆంధ్ర ప్రదేశ్‌లో యావరేజ్‌గా నిలిచింది. మిగిలిన చోట్ల బాగానే ఆడింది. నాకు బాధ లేదు. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్‌ జేబు ఖాళీ అవుతుంది. మంచి కంటెంట్‌ కోసం ఎదురుచూస్తున్నా. నాకు ఎలాంటి అంచనాలు లేవు. అయితే ఇప్పుడు వస్తున్న యువ దర్శకులకు నా గురించి, నేను ఏ సినిమాలో, ఏ స్టైల్‌లో నటిస్తే బాగుుంటుందో వాళ్లకు తెలుసు’’.
రజినీకాంత్ చెప్పింది నిజం...
‘‘కొన్ని రోజుల కిందట రజనీకాంత్‌ నాతో ఒక మాట అన్నారు. ‘మనం పని చేయాలనుకున్న లెజండరీ దర్శకులంతా ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతా కొత్త దర్శకులు ఉన్నారు. ఇలాంటప్పుడు మన అభిమానులు దర్శకులు అయితే, వారిపైనే ఆధారపడటమే. తన అభిమాన హీరోని తెరపై ఎలా చూపించాలో వాళ్లకు బాగా తెలుసు’ అన్నారు. అలా బాబీతో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చేశా. అభిమానులకు బాగా నచ్చింది. కమర్షియల్‌గానూ హిట్టయింది. ఇప్పుడు మరో అభిమాని వశిష్ఠతో  ‘విశ్వంభర’ చేస్తున్నా. తను నాకు వీరాభిమాని. కచ్చితంగా మంచి అవుట్‌పుట్‌ ఇస్తాడు.

Prasanth Varma: ఇక తేజ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలను


Updated Date - Apr 13 , 2024 | 05:59 PM