Chiranjeevi: 25 ఏళ్ల ప్రస్థానం.. శేఖర్ కమ్ములకు చిరు బెస్ట్ విషెస్
ABN , Publish Date - Jun 03 , 2025 | 02:58 PM
ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలాంటి అద్భుతమైన కళాఖండాలను తెరకెక్కించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లో ఒక జీవం ఉంటుంది. అందుకే ఆయనను క్లాసిక్ డైరెక్టర్ అని పిలుస్తారు.
ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరు లవ్ స్టోరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకొందరు యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. మరికొందరు కామెడీ సినిమాలు.. ఇలా ఒక్కో డైరెక్టర్ తన కథలను ప్రజెంట్ చేస్తారు. కానీ, కొంతమంది డైరెక్టర్స్ మాత్రమే మనం చూస్తుంది సినిమానా .. ? మన జీవితంలో.. మన పక్కింట్లో జరుగుతున్నట్లుగానే ఉందే అని ఫీల్ ని తెప్పించగలరు. అలాంటి డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఒకరు.
ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలాంటి అద్భుతమైన కళాఖండాలను తెరకెక్కించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లో ఒక జీవం ఉంటుంది. అందుకే ఆయనను క్లాసిక్ డైరెక్టర్ అని పిలుస్తారు. 2000 వ సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ అనే చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ ఏడాదితో శేఖర్ కమ్ముల 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నాడు. ఇండస్ట్రీలో 25 ఏళ్లు కొనసాగడం అంటే చిన్న విషయమేమీ కాదు. ఇన్నేళ్ళలో ఆయన తీసినవి తక్కువ సినిమాలే అయినా.. అవన్నీ అద్భుతాలే అని చెప్పొచ్చు.
శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలో 25 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా చిరంజీవి(Chiranjeevi).. ఆయనకు ఒక అద్భుతమైన బహుమతిని అందజేశారు. రెండు రోజుల క్రితమే శేఖర్ కమ్ముల.. చిరంజీవిని ఆయన నివాసంలోనే కలవడం జరిగింది. ఫ్యాన్ మూమెంట్ అని శేఖర్.. ఆ ఫోటోలను షేర్ చేశాడు. ఇక నేడు చిరు.. ఎక్స్ లో శేఖర్ కమ్ములకు బెస్ట్ విషెస్ తెలిపారు.
Also Read: Nagarjuna: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున
" మై డియర్ శేఖర్.. మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు 'వ్రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను" అంటూ ఒక పెన్ గిఫ్ట్ గా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం... కుబేర సినిమాతో బిజీగా ఉన్నాడు. జూన్ 20 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.