సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

K.S. Ramarao: 'రాక్షసుడు' నిర్మాత ఆవిష్కరించిన 'యమకింకరుడు' ట్రైలర్

ABN, Publish Date - Jul 22 , 2026 | 02:16 PM

తెలుగులో తొలి ఎ.ఐ. చిత్రం 'యమకింకరుడు'ను రూపొందించారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేశారు.

Yamakinkarudu Movie

ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర పోషిస్తూ, దర్శకత్వం వహించి నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘యమ కింకరుడు’. తెలుగు సినీ చరిత్రలోనే మొదటిసారిగా ఎ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపుదిద్దుకున్న చిత్రం తమదేనని రామసత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు చేసి, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కె.ఎస్. రామారావు మాట్లాడుతూ,'తెలుగు ఇండస్ట్రీలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రామసత్యనారాయణ ఎప్పుడూ ముందుంటారు. ఎ.ఐ. సాంకేతికతతో తెలుగులో మొదటి సినిమా తీయడం అభినందనీయం. ట్రైలర్ చాలా వినూత్నంగా, ఆసక్తికరంగా ఉంది. సుమన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, 'మా ‘యమ కింకరుడు’ ట్రైలర్‌ను విడుదల చేసి మమ్మల్ని ఆశీర్వదించిన 'రాక్షసుడు' నిర్మాత కె.ఎస్. రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగులో తొలి ఎ.ఐ. చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం మాకు ఎంతో గర్వకారణం. సుమన్ గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం సినిమా స్థాయిని పెంచింది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని అన్నారు.

ALSO READ:

స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్

Updated Date - Jul 22 , 2026 | 02:17 PM