సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ఈ వీకెండ్‌లో ఎనిమిది చిత్రాలు

ABN, Publish Date - May 14 , 2026 | 01:04 PM

ఈ వీకెండ్‌లో తెలుగులో నాలుగు స్ట్రయిట్‌ మూవీస్ తో పాటు నాలుగు అనువాద చిత్రాలు సందడి చేయబోతున్నాయి. గురువారం రావాల్సిన సూర్య 'వీరభద్రుడు'కు ఊహించని ఎదురు దెబ్బతగిలింది!

Weekend Releases

తమిళనాట స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతోందంటే ఎగ్జిబిటర్స్ భయపడిపోతున్నారు. ఆ సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా నిర్మాణ సంస్థలు పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్‌కు బకాయిలు ఉండటంతో చివరి నిమిషంలో వారి సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. గురువారం విడుదల కావాల్సిన సూర్య 'కరుప్పు' పరిస్థితి కూడా అదే అయ్యింది. మొన్నటి వరకూ లైకా సంస్థ నిర్మించిన సినిమాలు విడుదలకు పలువురు మోకాలడ్డేవారు. ఇప్పుడు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ సంస్థ కూడా అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. దీంతో గురువారం సూర్య మూవీ విడుదలకు నోచుకోలేదు. దాంతో సహజంగా 'కరుప్పు' తెలుగు వర్షన్‌ 'వీరభద్రుడు'కు చిక్కులు తప్పలేదు.


తమిళ అనువాద చిత్రం 'వీరభద్రుడు'తో పాటు 2011లో తెరకెక్కిన 'మహారాజా' అనే సినిమా కూడా ఇప్పుడు తెలుగులో 'ముసలోడికి దసరా పండగ' పేరుతో 15న వస్తోంది. అంజలి, నాజర్, అనిత, కోవై సరళ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ శుక్రవారం రెండు కన్నడ అనువాద చిత్రాలు తెలుగులో వస్తున్నాయి. రాజ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించిన 'రాక్షస పురం' అందులో ఒకటి. దీనిని తెలుగులో కె.ఎస్. రామారావు విడుదల చేస్తున్నారు. అలానే 15వ తేదీ జనం ముందుకు వస్తున్న మరో కన్నడ అనువాద చిత్రం 'కెడీ: ది డెవిల్‌'. గత నెలాఖరులో కన్నడంలో విడుదలైన ఈ సినిమా కాస్తంత ఆలస్యంగా తెలుగువారి ముందుకు వస్తోంది. ధృవ సర్జా హీరోగా నటించిన ఈ సినిమాను కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సంస్థ ప్రేమ్‌ దర్శకత్వంలో నిర్మించింది.


ఈ శుక్రవారం నాలుగు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో వెంకట్‌ హీరోగా నటించిన 'హరుడు' సినిమా ఒకటి. ఈ సినిమాకు ఆయనే నిర్మాత కూడా. చాలా కాలం తర్వాత వెంకట్‌ హీరోగా నటించిన చిత్రమిది. ఇక 90 బ్యాక్‌ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న సినిమా 'దూరదర్శని'. సువిక్షిత్‌, గీతిక జంటగా నటించిన ఈ సినిమాకు కార్తికేయ కొమ్ము డైరక్టర్. ఈ శుక్రవారం వస్తున్న మరో సినిమా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్‌ హోమ్'. త్రిగుణ్‌, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రాన్ని మధుదీప్‌ తెరకెక్కించాడు. హీరో కమ్‌ డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ రూపొందించిన 'అరేయ్‌ ఆపండ్రా' కూడా శుక్రవారం విడుదల అవుతోంది. సోనాక్షి వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని అశోక్‌ నిమ్మల నిర్మించారు. మరి ఈ సినిమాల్లో ఏవేవి ప్రేక్షకాదరణకు నోచుకుంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చ‌పై మధుర శ్రీధర్

అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్

Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!

Updated Date - May 14 , 2026 | 01:10 PM