సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీన్ .. సూర్య హ్యాట్రిక్ పట్టినట్టేనా

ABN, Publish Date - Nov 06 , 2026 | 10:05 AM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ ఇయర్‌గా మారింది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కరుప్పు సినిమాతో ఈ ఏడాది ప్రారంభించిన ఈ స్టార్ హీరో మధ్యలో విశ్వనాథ్ అండ్ సన్స్ తో మంచి విజయాన్ని అందుకొని ఏడాది చివరిలో సీన్ (Scene) తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు.

Suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ ఇయర్‌గా మారింది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కరుప్పు సినిమాతో ఈ ఏడాది ప్రారంభించిన ఈ స్టార్ హీరో మధ్యలో విశ్వనాథ్ అండ్ సన్స్ తో మంచి విజయాన్ని అందుకొని ఏడాది చివరిలో సీన్ (Scene) తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన సీన్ లో నజ్రియా హీరోయిన్ గా నటించగా కుర్ర హీరో నస్లెన్ విలన్ గా కనిపించాడు. మొదటి నుంచి కూడా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను జీతూ మాధవన్ అస్సలు తగ్గించలేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.


దివాళీ కానుకగా నవంబర్ 6 న రిలీజ్ అయిన సీన్ అటు తమిళ్, ఇటు తెలుగులో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. వినూత్నమైన డార్క్ క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, నూతనమైన ట్రీట్‌మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రంలో సూర్యతో పాటు నజ్రియా, నస్లన్ తమ అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని, విభిన్నమైన కథాంశంతో వస్తున్న చిత్రాలను ఎంచుకుంటూ సూర్య మరోసారి తన వర్సటైల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వస్తున్న మద్దతు చూస్తుంటే సూర్య ఖాతాలో మరో సక్సెస్ చేరినట్లేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


కథా పరంగా కొన్ని విమర్శలున్నప్పటికీ, సూర్య స్టార్ డమ్, ఆయన నటన ఈ సినిమాను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయని, నస్లెన్ ఎంట్రీకి, సూర్యతో ఫైట్ సీన్స్ కి ఈలలు పడ్డాయని అంటున్నారు. ఇక నజ్రియా పాత్ర చాలా బావుందని, సూర్య పోలీస్ గానే కాకుండా కూల్ గాయ్ గా కూడా ఎంతో ఈజ్ గా చేసినట్లు చెప్తున్నారు. సినిమా చాలా బావుందని, ఎలాంటి స్పాయిలర్స్ ని నమ్మవద్దని కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి వైవిధ్యమైన కథలతో పాటు కమర్షియల్ విజయాలను కూడా సొంతం చేసుకుంటూ సూర్య బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తున్నాడు. మరి ఈ సినిమా కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Also Read:

రజనీ పాత సినిమా టైటిల్‌తో.. సంతానం కొత్త ప్రయోగం

కొత్త ఇంటికి.. సీఎం విజ‌య్‌

డెత్ రైల్వే.. తెలుగు టైటిల్ టీజర్ చూశారా? రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో భారీ సినిమా

Updated Date - Nov 06 , 2026 | 10:16 AM