డెత్ రైల్వే.. తెలుగు టైటిల్ టీజర్ చూశారా? రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో భారీ సినిమా
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:30 AM
శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి డెత్ రైల్వే అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదలైన మూవీ టైటిల్ టీజర్‌కు మంచి ఆదరణ లభించింది.
శశికుమార్ (Sasikumar), సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి డెత్ రైల్వే (Death Railway) అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదలైన మూవీ టైటిల్ టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. యాతిసై (Yaathisai)ఫేం ధరణి రాజేంద్రన్ (Dharani Rasendran) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో టైటిల్ టీజర్ ను ప్రముఖ హీరో శివకార్తికేయన్ తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'తక్కువ బడ్జెట్‌తో, సరైన దార్శనికత, పక్కా ప్రణాళికతో ముందుకెళితే ఏం సాధించవచ్చో చూపించిన 'యాతిసై' చిత్ర బృందం. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'డెత్ రైల్వే'తో రూపుదిద్దుకుంది. ఈ మూవీ వారికి తగిన గుర్తింపును తెస్తుందని ఆశిస్తాను. చిత్ర బృందం మొత్తానికి నా శుభా కాంక్షలు' అంటూ శివకార్తికేయన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలోకి ప్రవేశించడానికి జపాన్ బర్మా, థాయిలాండ్ మధ్య రైల్వే లైన్ నిర్మించింది. ఈ నేపథ్యంలోనే 'డెత్ రైల్వే' మూవీ నిర్మించారు. టైటిల్ టీజర్ లో కథా పాత్రలను చూపించిన విధానం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించడంతో పాటు మూవీపై అంచనాలను పెంచేసింది. జేకే ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కిన చిత్రంలో శశికుమార్, సముద్రఖనితో పాటు భవానీ, కిషోర్, అశోక్ సెల్వన్ తదితరులు నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో పాన్ ఇండియాగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగులోను విడుదల చేసిన టైటిల్ టీజర్ వీడియో సైతం ఆకట్టుకునేలా ఉంది.