కొత్త ఇంటికి.. సీఎం విజ‌య్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 08:03 AM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయానికి సంబంధించి కీలక మార్పులు చేపట్టారు.

CM Vijay

త‌మిళ‌నాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) గురువారం ఉదయం తన అధికారిక నివాసంగా (Vijay Official Residence) మారనున్న భామణి ఇల్లమ్ (Bhamani Illam) ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ భవనంలో కొత్తగా చేస్తున్న మార్పులు, అక్కడ లభించనున్న సదుపాయాలను ఆయన తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ రోజూ నీలాంగరైలోని తన నివాసం నుంచి సచివాలయానికి కారులో వెళ్తున్నారు.

సుమారు సుమారు 17 కిలోమీటర్ల వరకు ఆయన భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ సచివాలయానికి వెళుతుండటం వల్ల ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి విజయ్ అడయార్ గ్రీన్ వేస్ రోడ్డులోని పొదిగైఇల్లమ్ ప్రాంగణంలో ఉన్న 'బామణి ఇల్లమ్'ను తన క్యాంపు కార్యాలయంగా మార్చాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా దానికి వెట్రి ఇల్లమ్ (Vetri Illam)గా పేరు మార్చారు. యేళ్ల తరబడి ప్రభుత్వ గెస్ట్ హౌస్‌గా ఉన్న 'భామణి ఇల్లమ్'లో గత కొన్నివారాలుగా ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక భద్రతా ఏర్పాట్లతో కూడిన క్యాంప్ కార్యాలయ మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ భామణి ఇల్లము అధికారులతో కలిసి పరిశీలించారు. అక్క‌డ కొత్తగా ఏర్పాటు చేస్తున్న‌ సదు పాయాలు గురించి తెలుసుకున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 08:03 AM