రజనీ పాత సినిమా టైటిల్‌తో.. సంతానం కొత్త ప్రయోగం

ABN , Publish Date - Nov 06 , 2026 | 08:20 AM

ప్ర‌ముఖ తమిళ నటుడు సంతానం మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Santhanam

ప్ర‌ముఖ తమిళ నటుడు సంతానం (Santhanam) మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఫాంటసీ నేపథ్యంలో టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'అదిశయ పిరవి' (Adhisaya Piravi) అనే టైటిల్ ఖరారు చేశారు. డెబ్యూ డైరెక్టర్ సుధామన్ కృష్ణ (Sudhaman Krishna.) దర్శకత్వం వహిస్తున్నాడు.

వైవిధ్యభరితమైన సరికొత్త కథాంశంతో తెరకెక్కించినట్టు హీరో సంతానం తెలిపారు. అందుకే ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుందని భావించి 1990లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `అది శయ పిరవి' టైటిల్ తీసుకున్నట్లు పేర్కొ న్నారు.

గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా టైమ్ లూప్ కాన్సెప్టులో వచ్చిన 'మానాడు' మూవీ బ్లాక్ బ‌స్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

Updated Date - Nov 06 , 2026 | 08:20 AM