సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుమయా రెండో చిత్రానికి అంతా సిద్ధం.. వివరాలివే

ABN, Publish Date - Nov 09 , 2026 | 08:26 PM

‘డియర్ ఉమ’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా, రచయితగా, నిర్మాతగా ఒకేసారి అడుగుపెట్టి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న టాలెంటెడ్ తెలుగమ్మాయి సుమయా రెడ్డి. ఆమె నుంచి ఇప్పుడు రెండో చిత్రం రాబోతోంది.

Sumaya Reddy

‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా, రచయితగా, నిర్మాతగా ఒకేసారి అడుగుపెట్టి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న టాలెంటెడ్ తెలుగమ్మాయి సుమయా రెడ్డి (Sumaya Reddy). తొలి సినిమాతోనే తన నటనతో, ప్రొడక్షన్ వేల్యూస్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె.. తాజాగా తన రెండో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘సుమ చిత్ర ఆర్ట్స్’ సమర్పణలో ప్రొడక్షన్ నెం.2గా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కూడా సుమయా రెడ్డి స్వయంగా హీరోయిన్‌గా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించనున్నారు.


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సుమయా రెడ్డి చేతి నిండా కరెన్సీ కట్టలు, బంగారు ఆభరణాలతో రాయల్ లుక్‌లో దర్శనమిచ్చారు. పోస్టర్‌లో ఆమె వేషధారణ, గాంభీర్యం చూస్తుంటే ఒక మహారాణి తరహాలో కనిపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో, కామెడీ-హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం హింట్ ఇచ్చింది.


విడుదలైన ఈ ఒక్క ప్రీ-లుక్ పోస్టర్‌తోనే సినిమా కథాంశంపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి ఉత్కంఠ నెలకొంది. తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమయా రెడ్డి, ఈసారి కామెడీ, హారర్ మేళవింపుతో సరికొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని ఈ సందర్భంగా సుమయా రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

సూర్య ‘సీన్’ 3 డేస్ కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టినట్టే

‘ధురంధర్ 2’ రికార్డులు బద్దలవుతున్నాయ్.. అంతా రామ మయం

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు? కారణమిదేనా..

Updated Date - Nov 09 , 2026 | 08:26 PM