దివంగత నటుడు శ్రీహరి ఇంట పెళ్లి సందడి
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:47 AM
దివంగత నటుడు శ్రీహరి, శాంతి దంపతుల పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.
దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి (Srihari) కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. శ్రీహరి, శాంతి (Shanthi) దంపతుల పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి (Shashank Srihari) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సంజన (Sanjana) తో ఆయన వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి అకాల మరణం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు చిన్న కుమారుడు మేఘాంశ్ (Megamsh Srihari) కొనసాగిస్తుండగా ఆయన నటించిన చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.
అయితే.. ఇప్పుడు పెద్ద కుమారుడు శశాంక్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కానుండటంతో శ్రీహరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం శశాంక్, సంజనల నిశ్చితార్థ వేడుక కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న జరగనున్న ఈ వేడుకతో శ్రీహరి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది. అయితే వివాహ తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.