లైన్లోకి వచ్చిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రిలీజ్ ఎప్పుడంటే
ABN, Publish Date - Nov 23 , 2026 | 06:06 PM
తెలుగు సినిమాపై ఉన్న ప్రేమతో, అమెరికాలో ఉద్యోగం చేస్తూనే తన చిన్ననాటి దర్శకత్వ కలను నిజం చేసుకుంటున్నారు రమేష్ బాబు చెరుకూరు. ఆయన దర్శకత్వం వహించిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది.
తెలుగు సినిమాపై ఉన్న ప్రేమతో, అమెరికాలో ఉద్యోగం చేస్తూనే తన చిన్ననాటి దర్శకత్వ కలను నిజం చేసుకుంటున్నారు రమేష్ బాబు చెరుకూరు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సినిమాలపై మక్కువతో ఆయన రూపొందించిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ (Siddu Gadi Love Story). శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 27న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఈ చిత్రంలో మనోజ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. శృతి, మోహన సిద్ధి హీరోయిన్లుగా ఆకట్టుకోనున్నారు. సీనియర్ నటుడు సుమన్ హీరో తండ్రి పాత్రలో కనిపించనుండగా, సర్కార్ విలన్‌గా నటించారు. వీరితో పాటు హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు తమ కామెడీతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు (Ramesh Babu Cherukuru) మాట్లాడుతూ.. ‘‘నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. ఒకవైపు జాబ్ కొనసాగిస్తూనే, నా మనసులో ఉన్న దర్శకత్వ కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ తెరకెక్కించాను. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను’’ అని తెలిపారు. ఒక మంచి ప్రేమకథగా రూపొందిన ఈ నూతన ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, మీడియా మిత్రులు ఆదరించి ప్రోత్సహించాలని చిత్ర బృందం కోరుతోంది.
ఇవి కూడా చదవండి:
భారత్ - పాక్ సైనికులతో.. ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్ వైరల్
ఆ దర్శకుడితో ఫహాద్ ఫాజిల్ క్రేజీ ప్రాజెక్ట్.. బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే
సంక్రాంతి పరీక్ష.. కృతి కెరీర్ మలుపు తిరుగుతుందా..