సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శర్వా ‘భోగి’.. రాఖీ స్పెషల్ పోస్టర్ వైరల్

ABN, Publish Date - Aug 28 , 2026 | 07:27 PM

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాస్ మావెరిక్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ఈ మూవీ నుంచి రక్షాబంధన్ స్పెషల్‌గా విడుదలైన పోస్టర్ వైరల్ అవుతోంది.

Bhogi Movie New Still

చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా, మాస్ మావెరిక్ సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi). శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై లక్ష్మి రాధామోహన్ సమర్పణలో కె.కె. రాధామోహన్ అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శర్వా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. తాజాగా రక్షాబంధన్ (Rakshabandhan) పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తూ.. వైరల్ అవుతోంది.


ఈ రాఖీ స్పెషల్ పోస్టర్‌లో శర్వానంద్ పూర్తి పల్లెటూరి కుర్రాడి అవతారంలో కనిపించి అలరించారు. పచ్చని పల్లెటూరి వాతావరణంలో తన తోబుట్టువుల మధ్య కూర్చుని తాటికాయలను కొట్టి అందరికీ పంచుతున్న దృశ్యం ఎంతో సహజంగా, మనసుకు హత్తుకునేలా ఉంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయ అనుబంధాలతో పాటు పల్లెటూరి జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ పండుగ స్ఫూర్తిని నింపుతూ సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘గంగ ఒక్కడే... ప్రాణాలు ఐదు’ అని మేకర్స్ రిలీజ్ చేసిన క్యాప్షన్ కూడా ఈ పోస్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్టయ్యింది.


1960ల కాలం నాటి నేపథ్యంలో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామంలో ఈ సినిమా కథ సాగనుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి టాలెంటెడ్ టెక్నీషీయన్స్ పని చేస్తున్నారు. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ.. భీమ్స్ సిసిరోలియో అందించే మాస్ ఎమోషనల్ స్కోర్, బీజీఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని చిత్రబృందం చెబుతోంది. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, పవర్‌ఫుల్ యాక్షన్ కలబోతగా రూపొందుతోన్న ఈ ‘భోగి’ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘శతచిత్ర మన్మథుడు’.. కింగ్ నాగ్‌కు హ్యాపీ బర్త్‌డే

విమెన్ ఆబ్జెక్టిఫికేషన్.. ‘పెద్ది’పై ఏడ్చిన వారంతా ‘టాక్సిక్’కు ఏమైపోయారు

Rag Mayur: సెప్టెంబర్ 18న 'అనుమాన పక్షి'

Updated Date - Aug 28 , 2026 | 07:27 PM