Rag Mayur: సెప్టెంబర్ 18న 'అనుమాన పక్షి'
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:50 PM
'డిజె టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ తెరకెక్కించిన 'అనుమాన పక్షి' సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. రాగ్ మయూర్ సరసన ఈ సినిమాలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్ గా నటించింది.
'డిజె టిల్లు'తో సెన్సేషనల్ డెబ్యూను అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ రెండో సినిమా 'అనుమాన పక్షి'. రాగ్ మయూర్ హీరోగా ఈ సినిమాను రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మించారు. తొలి చిత్రం తరహాలోనే ఈ సినిమానూ యునిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా విమల్ కృష్ణ తెరకెక్కించారు.
తమ ‘అనుమాన పక్షి’ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల తేదీని తెలియజేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా విభిన్నమైన టోన్‌తో పాటు హీరో విచిత్రమైన ఆలోచనా విధానాన్ని ఈ పోస్టర్ ప్రజెంట్ చేస్తోంది. రాగ్ మయూర్ సంప్రదాయ దుస్తుల్లో చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన పక్కనే ఉన్న బ్లాక్‌బోర్డుపై 'డౌట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్' అనే టైటిల్‌తో జీవితం, విధి, కర్మ, దేవుడి ప్లానింగ్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలను పొందుపరిచారు. 'ఒన్ బోయ్. బిలియన్ థాట్స్, జీరో చిల్' అనే ట్యాగ్‌లైన్ ఆయన పాత్రలోని ఆలోచనా విధానాన్ని మరింత ఆసక్తికరంగా తెలియజేస్తోంది.

‘డీజే టిల్లు’తో తనదైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ ‘అనుమాన పక్షి’తో మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తుండగా, ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ నామా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా, అభినవ్ కునపరెడ్డి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం మరో మూడు వారాల్లో థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత ముమ్మరం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి దిల్ రాజు Vs మైత్రీ! ఈసారి ఏమయ్యేనో
Varun Tej: 'బరి’ పై వరుణ్ తేజ్ ఫోకస్.. ఈసారి గెలుపే టార్గెట్!