విమెన్ ఆబ్జెక్టిఫికేషన్.. ‘పెద్ది’పై ఏడ్చిన వారంతా ‘టాక్సిక్’కు ఏమైపోయారు

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:56 PM

సోషల్ మీడియాలో సెలెక్టివ్ మోరాలిటీ, ద్వంద్వ ప్రమాణాలు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ‘పెద్ది’లో జాన్వీ పాత్రపై గగ్గోలు పెట్టిన వారంతా.. ఇప్పుడు ‘టాక్సిక్’కు ఏమైపోయారనేలా టాక్ వైరల్ అవుతోంది.

Peddi vs Toxic

సోషల్ మీడియాలో సెలెక్టివ్ మోరాలిటీ, ద్వంద్వ ప్రమాణాలు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన సినిమా ‘పెద్ది’ (Peddi)కి సంబంధించి హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఒక చిన్న సీన్‌లో కనిపించిన తీరుకు.. కొందరు నెటిజన్లు, నికార్సైన మేధావులు ఒక రేంజ్‌లో గగ్గోలు పెట్టారు. ‘విమెన్ ఆబ్జెక్టిఫికేషన్’ (Women Objectification) అంటూ నీతులు చెబుతూ, మహిళా గౌరవం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. మెగా హీరోల సినిమాలపై విషం చిమ్మడానికి కాచుక్కూర్చునే ఆ బ్యాచ్, ఆ చిన్న అంశాన్ని పట్టుకుని తీవ్రంగా ట్రోల్ చేస్తూ నానా హంగామా సృష్టించింది. కానీ, ఇప్పుడు రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ థియేటర్లలోకి వచ్చాక.. అప్పట్లో నీతులు చెప్పిన ఆ గొంతులన్నీ ఉన్నట్టుండి మూగబోవడమే.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


పాన్-ఇండియా రేంజ్‌లో విడుదలైన ‘టాక్సిక్’ (Toxic) సినిమాలో మహిళా పాత్రలను చూపించిన తీరుపై సాధారణ ప్రేక్షకులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లను కేవలం ఆకర్షణ వస్తువులుగా, అడల్ట్ సీన్లకు మాత్రమే పరిమితం చేస్తూ అత్యంత అసభ్యకరమైన రీతిలో తెరపై ప్రజెంట్ చేశారనే విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్‌తో పాటు ఇతర నటీమణుల పాత్రల చిత్రీకరణ చూసి నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇంత స్పష్టంగా, విచ్చలవిడిగా విమెన్ ఆబ్జెక్టిఫికేషన్ కళ్లముందే కనిపిస్తున్నా.. ‘పెద్ది’ టైమ్‌లో మహిళా సాధికారత గురించి మైకులు పట్టుకుని అరిచిన సోకాల్డ్ మేధావులు.. ఇప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? ఆ రోజున గగ్గోలు పెట్టిన వాళ్లంతా ఇప్పుడు సడెన్‌గా గుడ్డివాళ్లయిపోయారా? అంటూ సినీ ప్రియులు, మెగా అభిమానులు నిలదీస్తున్నారు.


ఈ వ్యవహారం వెనుక ఉన్న ద్వంద్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలీవుడ్‌కు చెందిన వారు కూడా ‘పెద్ది’ విషయమై చర్చలు పెట్టారు కదా.. మరి ‘టాక్సిక్’లో అదే ఇండస్ట్రీకి చెందిన వారిని ఎలా చూపించారో కనిపించలేదా? ఈ చిత్రానికి మహిళా దర్శకురాలైన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించినంత మాత్రాన ఇంతటి అసభ్యతను ప్రశ్నించకుండా చూసీచూడనట్లు వదిలేస్తున్నారా? లేక కేవలం మెగా హీరోల చిత్రాలను, తెలుగు స్టార్ల సినిమాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బద్నామ్ చేయడమే తమ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. నచ్చిన వారికి ఒక న్యాయం, మెగా హీరోల సినిమాలకు మరొక న్యాయం అన్నట్లుగా సాగుతున్న ఈ హిపోక్రసీని చూసి నెటిజన్లు ఛీత్కరించుకుంటున్నారు. సినిమాలోని తప్పును తప్పుగా చూపించడంలో కూడా ప్రాంతం, హీరో, దర్శకురాలి నేపథ్యాన్ని బట్టి స్వరం మార్చే ఇలాంటి సెలెక్టివ్ విమర్శకుల అసలు నైజం ‘టాక్సిక్’తో పూర్తిగా తేటతెల్లమైందనేలా టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Rag Mayur: సెప్టెంబర్ 18న 'అనుమాన పక్షి'

మంత్రి లోకేష్ వెంటనే కల్పించుకోవాలి.. ఇరుముడిలో ఆ సీన్లు తొల‌గింప‌జేయాలి! ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మ‌రోసారి దిల్ రాజు Vs మైత్రీ! ఈసారి ఏమ‌య్యేనో

Updated Date - Aug 28 , 2026 | 04:56 PM