‘శతచిత్ర మన్మథుడు’.. కింగ్ నాగ్‌కు హ్యాపీ బర్త్‌డే

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:09 PM

‘కింగ్’గా అభిమానుల మదిలో నిలచిన నాగార్జున తన వందో చిత్రంతో పలకరించనున్నారు. ఆగస్ట్ 29న నాగార్జున బర్త్ డే.. ఈ సందర్భంగా ‘శతచిత్ర సుందరుడు’ కాబోతున్న నాగ్ సినీజర్నీని గుర్తు చేసుకుందాం.

King Nagarjuna

‘కింగ్’గా అభిమానుల మదిలో నిలచిన నాగార్జున (King Nagarjuna) తన వందో చిత్రంతో పలకరించనున్నారు. ఆగస్ట్ 29న నాగార్జున బర్త్ డే (Happy Birthday Nagarjuna).. ఈ సందర్భంగా ‘శతచిత్ర సుందరుడు’ కాబోతున్న నాగ్ సినీజర్నీని గుర్తు చేసుకుందాం.

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటవారసునిగా అడుగు పెట్టిన నాగార్జున - యువసమ్రాట్‌గా జనం మదిలో నిలిచారు. ఆ పై అనేక అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. నటనలోనే కాకుండా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా నాగార్జున తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. గత సంవత్సరం విడుదలైన ‘కుబేర’, ‘కూలీ’ రెండు చిత్రాల్లోనూ నాగార్జున విలక్షణమైన పాత్రల్లో నటించి అలరించారు. రాబోయే రోజుల్లోనూ వైవిధ్యానికే పెద్ద పీట వేస్తూ సాగే ప్రయత్నంలో ఉన్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున తన నూరవ చిత్రంతో బిజీగా ఉన్నారు. రా.కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నాగ్ నటించి, నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పలు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తన నూరవ సినిమాను ఓ మెమరబుల్ మూవీగా అభిమానులకు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు నాగ్.


‘విక్రమ్’ సినిమాతో హీరోగా అడుగు పెట్టిన నాగార్జున ‘శివ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవైపు మరలేలా చేసుకున్నారు. ‘శివ’ ఇమేజ్ వల్ల వరుస ఫ్లాపులు చూసినా.. ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’తో మళ్ళీ ఊపందుకున్న నాగార్జున ఆ పై ‘హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడతా, అన్నమయ్య, నువ్వు వస్తావని, మన్మథుడు, శివమణి, నేనున్నాను, మాస్, శ్రీరామదాసు’ వంటి చిత్రాలతో అభిమానులను విశేషంగా అలరించారు. తన తరం హీరోల్లో భక్తుల పాత్రల్లో నటించి ఆకట్టుకున్న ఘనతను సొంతం చేసుకున్నారు నాగ్. ‘అన్నమయ్య’ సినిమా నాగార్జునకు నటునిగా ఎనలేని పేరు సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే.


నాగార్జున స్టార్‌గా సాగే నాటికే ఆయన తండ్రి నాగేశ్వరరావు కేరెక్టర్ రోల్స్‌లోకి మళ్ళారు. అయితే నాగార్జున మాత్రం తన ఇద్దరు తనయులు హీరోలుగా రాణిస్తున్నా, ఇప్పటికీ స్టార్‌గా జేజేలు అందుకుంటూ ఉండడం విశేషం. నాగార్జున తన చిత్రాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. అన్నపూర్ణ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా టాలెంట్ ఉన్నవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. యంగ్ జనరేషన్‌తో కలసి పనిచేస్తూ మరింత హుషారుగా ఉన్నారు నాగ్. ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా అలరిస్తూ సాగుతున్న నాగ్ రాబోయే తన నూరవ చిత్రంతో మరింతగా యూత్‌కు కనెక్ట్ కావాలని ఆశిస్తున్నారు. ఇంతకూ నాగ్ నూరవ సినిమా ఏ టైటిల్‌తో జనం ముందు వాలుతుందో తెలుసుకునే ముందు.. ఈ శతచిత్ర మన్మథుడికి హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దాం.

ఇవి కూడా చదవండి:

విమెన్ ఆబ్జెక్టిఫికేషన్.. ‘పెద్ది’పై ఏడ్చిన వారంతా ‘టాక్సిక్’కు ఏమైపోయారు

Rag Mayur: సెప్టెంబర్ 18న 'అనుమాన పక్షి'

మంత్రి లోకేష్ వెంటనే కల్పించుకోవాలి.. ఇరుముడిలో ఆ సీన్లు తొల‌గింప‌జేయాలి! ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Updated Date - Aug 28 , 2026 | 06:09 PM