సంపత్ నంది సినిమాను లైన్‌లో పెట్టిన శర్వా.. కీలక అప్డేట్ ఇదే!
ABN, Publish Date - Apr 14 , 2026 | 09:17 PM
‘నారీ నారీ నడుమ మురారీ, బైకర్’ చిత్రాలతో దూసుకుపోతున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం దర్శకుడు సంపత్ నందితో తొలిసారి శర్వానంద్ చేతులు కలిపారు.
‘నారీ నారీ నడుమ మురారీ, బైకర్’ చిత్రాలతో దూసుకుపోతున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), ‘భోగి’ (Bhogi) చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం దర్శకుడు సంపత్ నందితో తొలిసారి శర్వానంద్ చేతులు కలిపారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ‘బైకర్’ (Biker) మూవీ ప్రమోషన్స్ నిమిత్తం తీసుకున్న బ్రేక్ అనంతరం, శర్వానంద్ మళ్లీ ఈ సినిమా షూట్‌లో జాయిన్ అయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రిలో అత్యంత కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను ప్రారంభించిందని, షూటింగ్ రంపచోడవరం అడవులలోని కఠినమైన, సవాలుతో కూడిన ప్రదేశాలలో జరగనుందని, ఇక్కడ ఎక్సయిటింగ్, టఫ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. ఈ సన్నివేశాలను యాక్షన్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటున్నారని, ఇది సినిమా నిర్మాణానికి కీలక షెడ్యూల్ అని మేకర్స్ ప్రకటించారు. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో శర్వానంద్ ఒక సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ఆ విషయం ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ తెలియజేసింది.
1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవికమైన కథనం, పవర్ ఫుల్ నేపథ్యంతో ఈ చిత్రం ఇంటెన్స్ డ్రామాతో గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని చిత్రబృందం చెబుతోంది. శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రక్షా బంధన్ స్పెషల్‌గా 28 ఆగస్ట్, 2026న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్
అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!
షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?
‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!