శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ABN, Publish Date - Nov 19 , 2026 | 08:56 PM
చార్మింగ్ స్టార్ శర్వా మునుపెన్నడూ కనిపించని ఊరమాస్, రస్టిక్ అవతార్‌లో నటించిన ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
చార్మింగ్ స్టార్ శర్వా (Sharwa) మునుపెన్నడూ కనిపించని ఊరమాస్, రస్టిక్ అవతార్‌లో నటించిన ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi). మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో శర్వా 38వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. సెన్సార్ కార్యక్రమాల కారణంగా కొంత ఆలస్యమైన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేయడంతో పాటు, తాజాగా మేకర్స్ అధికారిక విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 27వ తేదీ (Bhogi Release Date)న ‘భోగి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. డిసెంబర్, జనవరి నెలల్లో భారీ సినిమాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, నవంబర్ 27 సరైన సమయమని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఒంటినిండా రక్తంతో, నోట్లో బీడీ కాలుస్తూ, పక్కనే రక్తంతో తడిసిన పదునైన కత్తితో శర్వా భీకరంగా కనిపిస్తున్నారు. వెనుక జనసందోహం, మంటల నేపథ్యంలో శర్వా లుక్ చూస్తుంటే థియేటర్లలో ఏ రేంజ్ యాక్షన్ ఉండబోతోందో అర్థమవుతోంది. ఇందులో శర్వా ‘గంగా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలోని ఇంటెన్సిటీని తెరపైకి తీసుకురావడానికి శర్వా తన లుక్‌తో పాటు శారీరకంగానూ పూర్తిగా మారిపోయారు. ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన డ్రామాకు హై ఇంటెన్సిటీ యాక్షన్‌ను జోడించి దర్శకుడు సంపత్ నంది ‘భోగి’ని భారీ స్థాయిలో తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో, చిత్ర బృందం ఫైనల్ ఫేజ్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
నా కుమార్తెపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్
‘ఆదర్శ కుటుంబం’ టీమ్ పై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు