శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ.. సభ్యుల విజ్ఞప్తి ఇదే
ABN, Publish Date - Jul 12 , 2026 | 05:28 PM
తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ యూనియన్‌కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది డ్యాన్సర్లు, మాస్టర్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ అసోసియేషన్‌లో తాజాగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ యూనియన్‌కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది డ్యాన్సర్లు, మాస్టర్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ అసోసియేషన్‌లో తాజాగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ (Sekhar Master), జానీ మాస్టర్ (Jani Master) బృందాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసోసియేషన్ ఎన్నికలు, కొత్త సభ్యత్వాల కేటాయింపు విషయంలో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో తమ వర్గం పైచేయి సాధించాలనే వ్యూహాలు, అలాగే సభ్యత్వాల మంజూరులో జరుగుతున్న పరిణామాలే ఈ గొడవకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఈ ఘర్షణ కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా, సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు, అసోసియేషన్ తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాల పైకి కూడా మళ్లింది. సాధారణ సభ్యుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. యూనియన్ నిధుల వినియోగం, అంతర్గత కమిటీల నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని ఇరు బృందాల సభ్యులు వాదించుకున్నట్లు సమాచారం. డ్యాన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఇరు మాస్టర్ల ముఖ్య అనుచరులు, బృందాల మధ్య జరిగిన ఈ తీవ్ర వాగ్వాదంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అసోసియేషన్ గత కొన్ని రోజులుగా ఈ గొడవలతో వార్తల్తో నిలుస్తోంది. ఇప్పుడు ఏకంగా రణరంగంగా మారింది.
ఈ వివాదం మరింత ముదిరితే డ్యాన్సర్ల ఉపాధిపై దెబ్బ పడే ప్రమాదం ఉందని సాధారణ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలో గుర్తింపు ఉన్న ఇద్దరు పెద్ద మాస్టర్ల మధ్య ఇలాంటి విభేదాలు రావడం డ్యాన్స్ యూనియన్ ప్రతిష్టను మసకబారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, యూనియన్ సీనియర్ నిర్వాహకులు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి, త్వరలోనే ఈ వివాదాన్ని పూర్తిగా సర్దుమణిగేలా చేసి అసోసియేషన్‌లో మళ్లీ పూర్వపు ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావాలని వారు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ముంబై హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్‌ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
ప్రకాష్ రాజ్‌ని బండ్ల గణేష్ అంత మాట అన్నాడేంటి.. ఈ బ్యాటింగ్ ఏంటి సామి?
‘లెనిన్’ 2 డేస్ కలెక్షన్స్.. అస్సలు ఊహించి ఉండరు