‘లెనిన్’ 2 డేస్ కలెక్షన్స్.. అస్సలు ఊహించి ఉండరు
ABN , Publish Date - Jul 12 , 2026 | 02:56 PM
వరుస పరాజయాల తర్వాత అఖిల్ కెరీర్‌లో సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ‘లెనిన్’ చిత్రం ఊహించని రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని, ప్రేక్షకులను భారీగా థియేటర్లకు రప్పిస్తోంది. వరుస పరాజయాల తర్వాత అఖిల్ కెరీర్‌లో సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ‘లెనిన్’ చిత్రం ఊహించని రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను (Lenin 2 Days Collections) సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజైన శనివారం కలెక్షన్లలో సుమారు 14 శాతం పెరుగుదల కనిపించడం ఈ సినిమాకు వస్తున్న ప్రజాదరణకు అద్దం పడుతోంది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘లెనిన్’ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో మాస్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం ఈవినింగ్, నైట్ షోలకు థియేటర్లలో దాదాపు 73 శాతానికి పైగా అక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. అలాగే అమెరికా వంటి నార్త్ అమెరికా మార్కెట్లలో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అక్కడ ఇప్పటికే ఈ సినిమా 425K డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోందని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఫస్ట్ టైమ్ అఖిల్ మాస్ లుక్‌లో కనిపించిన తీరుకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ కలెక్షన్ల జోరు చూస్తుంటే అఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో నాగార్జున నటించిన ‘నా సామి రంగ’ సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను, అలాగే అఖిల్ కెరీర్‌లో అప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రికార్డులను ఈ చిత్రం మొదటి వీకెండ్ ముగిసే సమయానికే అధిగమించేలా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, థమన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇదే ఊపు గనుక కొనసాగితే, ఈ వీకెండ్ ముగిసే సరికి ‘లెనిన్’ చిత్రం రూ. 50 కోట్ల క్లబ్‌లోకి సులభంగా చేరిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదివారం బుకింగ్స్ చూస్తుంటే.. ఆ మార్క్‌ని ‘లెనిన్’ ఈజీగా టచ్ చేస్తుందని అనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి?
Jagapathibabu: మళ్లీ హీరోగా చేయడానికి కారణమదే..
అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్!