ప్రకాష్ రాజ్‌ని బండ్ల గణేష్ అంత మాట అన్నాడేంటి.. ఈ బ్యాటింగ్ ఏంటి సామి?
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:56 PM
ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ మరోసారి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. నీ పని నువ్వు చూసుకో.. తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రకాష్ రాజ్ (Prakash Raj) పై బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. నీ పని నువ్వు చూసుకో.. తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతకు ముందు ప్రకాష్ రాజ్ ‘దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇటీవల అరెస్ట్ అయిన యూట్యూబర్ రావణ్ (Ravan) విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు అలా ఉందంటూ మొదటి నుంచి ప్రకాష్ రాజ్ ఇదే మాటతో వీడియోలు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. రావణ్‌పై UAPA కేసు నమోదైన తర్వాత ఆయన వీడియోలు చేయడంలో కొంత గ్యాప్ ఇచ్చారు. దీంతో ప్రకాష్ రాజ్ భయపడిపోయాడంటూ కొందరు చేస్తున్న కామెంట్స్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఈ రోజు ఆయన ఆదివారం వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దీనికి బండ్ల గణేష్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘‘ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్.. నీకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తే వాళ్లకే అనుగుణంగా డైలాగులు చెబుతావు. అకౌంట్‌లో డబ్బులు పడితే నీ స్టాండ్ కూడా మారిపోతుంది. అందుకే నిన్ను చాలామంది “Any Time Money” అంటున్నారు. తెలుగు ప్రజలు అమాయకులు కాదు. ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఎవరు అజెండాతో మాట్లాడుతున్నారు అనేది వారికి బాగా తెలుసు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో. తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదు’’ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్‌కు.. భలే ఇచ్చావ్ అన్నా అంటూ నెటిజన్లు కొందరు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన వీడియోలో..
‘‘హాయ్! నేను మౌనంగా లేను, అన్నీ చూస్తున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్‌తో జనసైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కడుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు... అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే... దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి! ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో.. దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, నాలుగు వైపుల నుంచి దిగజారండి! సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అని గర్వంతో దిగజారండి. మీరు ఎంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా.. నాలాంటి ప్రశ్నించే గొంతును ఆపలేరు. కానివ్వండి.. మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి.. జస్ట్ ఆస్కింగ్’’ అని మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
‘లెనిన్’ 2 డేస్ కలెక్షన్స్.. అస్సలు ఊహించి ఉండరు
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి?
Jagapathibabu: మళ్లీ హీరోగా చేయడానికి కారణమదే..